హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిండు గర్భంతో ఉన్న ఆ ఫోటోలను చూసి అభిమానులు చర్చించుకుంటున్నారు. అనుపమ పరమేశ్వరన్‌కు పెళ్లి ఎప్పుడు అయ్యింది ? ఇది నిజమేనా అని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సెలబ్రిటీలు సైతం దీనిపై స్పందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే నాయికల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అభిమానులతో తన సినిమా కబుర్లతోపాటు అప్పుడప్పుడు వ్యక్తిగత విషయాల్ని పంచుకుంటుంటారు.

తాజాగా.. బేబీ బంప్ ఫొటోను ఆమె పంచుకోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు విషయం ఏంటంటే.. అనుపమ 2019లో మనియరయిలే అశోకన్ అనే మలయాళ చిత్రంలో నటించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆమె గర్భవతిగా కనిపిస్తారు. ఆ షూటింగ్ లో పాల్గొన్న ఫొటోల్ని భద్రంగా దాచుకున్న అనుపమ తాజాగా సోషల్ మీడియా వేదికగా వాటిని షేర్ చేశారు. ఇందులో అనుపమ తండ్రి ఆమెను ఆప్యాయంగా పట్టుకుని కనిపించారు.

ఈ ఫోటోలు చాలా సహజంగా ఉండటంతో ఆమె నిజంగా గర్భవతి అయ్యిందా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ప్రేమమ్’ అనే మలయాళ సినిమాతో నటిగా మారిన అనుపమ అఆతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమకోసమే తదితర చిత్రాలతో అలరించిన ఆమె ఈ సంక్రాంతికి రౌడీబాయ్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం 18 పేజెస్, కార్తికేయ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక అనుపమ బేబీ బంప్ ఫోటో చూసి పలువురు సెలబ్రిటీలు సరదాగా స్పందించారు. కంగ్రాట్స్ అనుపమ అంటూ నవ్వుల ఎమోజీలు జత చేశారు.
భీమ్లానాయక్‌పై రామ్‌గోపాల్ వర్మ హాట్ కామెంట్స్