Saturday, May 4, 2024
- Advertisement -

హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఈగ విలన్

- Advertisement -

ఈగ సినిమాతో విలనిజం చూపించిన సుదీప్.. హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన హీరోగా నటించిన కన్నడ చిత్రం కే3. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడలో విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే 40 కోట్లు వసూలు చేసింది.

కన్నడలో ఘన విజయం సాధించిన కే3ని .. తెలుగులో కే3 కోటికొక్కడు పేరుతో శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించారు. మడోన్నా సెబాస్టియన్‌, శ్రద్ధాదాస్‌ కథానాయికలు. ఈ సినిమాని ఫిబ్రవరి 4న తెలుగులో విడుదల చేయనున్నారు. ఇందులో సుదీప్‌ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ .. మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో సుదీప్‌ విభిన్న పాత్రల్లో మెప్పించారు. మడోన్నా సెబాస్టియన్‌–సుదీప్‌ జోడి చూడముచ్చటగా ఉంటుందన్నారు. ఆషికా రంగనాథ్‌ ప్రత్యేక గీతంలో అలరించింది. మరి సుదీప్ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెస్పరైజ్‌ చేస్తాడో చూడాలి మరి.

ప్ర‌భుత్వాన్ని ఢీ కొట్ట‌నున్న జూనియ‌ర్ ఎన్‌టీఆర్

మెన్స్ టాయిలెట్‌లోకి వెళ్లిన హీరోయిన్స్.. అలా చేస్తే తప్పేంటి ?

ఖిలాడీ డైరెక్టర్‌కు ఓ రేంజ్ గిఫ్ట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -