Friday, April 26, 2024
- Advertisement -

ఎదుటివారిని మీరు ఎంత ప్రేమిస్తున్నారో చెప్పేయండి.. అనుష్క?

- Advertisement -

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న వారిలో అనుష్క శెట్టి ఒకరు.అందం అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ జేజమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాకి దూరంగా ఉండే అనుష్క తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే అనుష్క పోస్ట్ చేస్తూ… అందరితో ఎంతో ప్రేమగా ఉండండి.. ఎదుటివారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పేయండి. ప్రతి విషయంలోనూ మంచిని, అందాన్ని వెతుకుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి కానీ మన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ బాధపడకుండా కొత్త ఆరంభానికి స్వాగతం పలకాలని అనుష్క తెలిపారు.

Also read:ఆచార్య నుంచి మరో సర్ప్రైస్.. ఈసారి చెర్రీ వంతు?

జీవితంలో మనం కోల్పోయినది గుర్తు చేసుకుంటూ బాధపడకుండా ఎప్పుడు హాయిగా నవ్వుతూ… జీవితంలో ఎక్కువ ఆశలు పెట్టుకొని ఎక్కువగా బ్రతకడానికి ప్రయత్నించండి. మీ కోసం మీరు ఎక్కువ సమయాన్ని గడపండి.నీలోని బాధ పోగొట్టే వారితో ఎక్కువ సమయం కేటాయించండి.. ఈ ప్రపంచంలో అందమైనవన్నీ మాయమై పోతుంటాయి. అందులో మన హృదయం ఉండకుండా చూసుకోవాలని స్వీటీ ఎంతో చక్కగా వివరించారు. ప్రస్తుతం అనుష్క షేర్ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

Also read:వామ్మో… అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిన నయన్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -