Saturday, April 20, 2024
- Advertisement -

రూ.100 కోట్ల ఎక్కడికి మాయమయ్యాయి?

- Advertisement -

సాధారణంగా ఏదైనా బ్యాంకు దోపిడీ జరిగితే అది ఎలా జరిగింది? డబ్బులు ఎలా మాయమయ్యాయి అనే సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రమే “100 క్రోర్స్‌”. ‘హ్యాపీ డేస్‌’ ఫేమ్ రాహుల్ టైసన్ చేతన్, ఎమీ, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తీవ్ర ఉత్కంఠతల నడుమ సాగే ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Also read:రసవత్తరంగా మారిన “మా” ఎన్నికలు.. బరిలోకి ఓ. కళ్యాణ్?

విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దివిజ సమర్పణలో సాయి కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ… క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రమే “100 క్రోర్స్‌”. హై సెక్యూరిటీ అండర్ లో ఉండే ఈ డబ్బులను ఎవరు మాయం చేశారు? ఆ డబ్బులు ఎక్కడ దాచారు? పోలీసులు ఏ విధంగా ఆ డబ్బును కనిపెట్టారు అనే కథాంశంతో తెరకెక్కినదని తెలిపారు.

Also read:ప్రమాదంలో ఎడమ కన్ను చూపు కోల్పోయిన కత్తి మహేష్?

ఎంతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా. యాక్షన్ తరహాలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చుతుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడారు.ఈ చిత్రానికి సహనిర్మాత: శ్రీకాంత్‌ దీపాల, కథ, సంగీతం: సాయి కార్తీక్‌ అందించారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://youtu.be/G-7w7coe63A

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -