తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు.. కానీ కొద్ది మంది మాత్రమే తమ నటనతో ప్రేక్షకుల హృదయాలు గెల్చుకున్నారు. ఒకప్పుడు సావిత్రి,అంజలి,జమున,భానుమతి లాంటి గొప్ప నటీమణుల తర్వాత శ్రీదేవి,జయప్రద,జయసుధ ఆ తర్వాత సౌందర్య లాంటి నటీమణులు ఇండస్ట్రీలో తమ గొప్ప నటన చాటుకున్నారు. ఆ తర్వాత బెంగుళూరు బ్యూటీ అనుష్క శెట్టి ఆ స్థాయిలో తన నటనతో మెప్పించింది. అనుష్క పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘సూపర్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. స్టాలిన్, కేడి, కింగ్ లాంటి సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసింది.
మొదట గ్లామరస్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మనసు దోచిన ఈ చిన్నది.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అరుంధతి’ చిత్రంతో తన స్టైల్ పూర్తిగా మార్చింది. కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడంతో ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. అరుంధతి, పంచాక్షరి, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్దం లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అనుష్కను మరోస్థాయిలో నిల్చోబెట్టాయి.
గ్లామర్ కే ప్రాధాన్యత ఇచ్చే ఈ కాలంలో ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తూ వచ్చింది. వేదం, విక్రమార్కుడు, ఖలేజా, సింగం, మిర్చి, బాహుబలి లాంటి సినిమాల్లో ఆమె నటవిశ్వరూపం చూపించింది. ఈరోజు (నవంబర్ 7న) అనుష్క శెట్టి 39వ పుట్టినరోజు జరుపుకుంటుంది. అందాల బొమ్మాళి అనుష్క శెట్టి ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆద్యా న్యూస్ కోరుకుంటుంది.
‘సామ్ జామ్’ ఆహా లో సమంత సరికొత్త టాక్ షో
ఇటలీ వీధుల్లో ప్రభాస్ కొత్త ఫొటోలు.
