Sunday, April 28, 2024
- Advertisement -

బాబోయ్ పక్షి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చి చేప.. అయినా..

- Advertisement -

ప్రపంచంలో ఎన్నో వింతలూ విశేషాలు జరుగుతుంటాయి. ఒకప్పుడు ఈ విషయాలు పేపర్ లో పడితే కానీ తెలిసేది కాదు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో అరుదైన విశేషాలు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. తాజాగా అమెరికాలోని మేరీల్యాండ్ లో ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. శామ్ డేవిస్ అనే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ మేరీల్యాండ్ అటవీప్రాంతంలో ఫొటోలు తీస్తుండగా కొంగ జాతికి చెందిన ఓ హెరాన్ పక్షి పొట్ట చీల్చుకుని స్నేక్ హెడ్ ఈల్ (మలుగు) చేప బయటికి వచ్చిన దృశ్యం ఫొటోగ్రాఫర్ కంటబడింది. మొదట అతనికి అర్థం కాకున్నా తర్వాత పరీక్షగా చూసిన తర్వాత షాక్ తిన్నాడు.

ఈల్ చేప పక్షి పొట్టను చీల్చుకుని వచ్చినట్టు గుర్తించాడు. ఆ ఈల్ చేప పొట్ట చీల్చడంతో గాయమైనా, హెరాన్ పక్షి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎగురుతుండడం విశేషం. సాధారణ పరిస్థితుల్లో పొట్ట చీలిపోతే పక్షి బతకడం కష్టమని.. సాధారణంగా ఈల్ చేపలు పక్షులు తమను భోంచేసినప్పుడు తమ పదునైన తోకతో బయటపడేందుకు ప్రయత్నిస్తాయని ఫొటోగ్రాఫర్ శామ్ డేవిస్ వెల్లడించాడు.

చలికాలంలో దొరికే ఫలాలు.. మధుమేహుల పాలిట వరాలు..

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

గుండె కోసం ఈ పది సూపర్ ఫుడ్స్

త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -