Saturday, April 20, 2024
- Advertisement -

రాక్షసుడు సీక్వెల్​లో విజయ్​ సేతుపతి?

- Advertisement -

తమిళ విలక్షణ నటుడు విజయ్​ సేతుపతి వరస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఆయనకు పాన్​ ఇండియా లెవెల్​లో అనేక అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం డేట్స్​ కూడా ఖాళీ లేవు. అంత బిజీ అయిపోయాడు విజయ్​ సేతుపతి. అది హీరో వేషమా? విలన్​ వేషమా? అన్నది విజయ్​కు అనవసరం. తను చేయబోయే పాత్రలో నటనకు స్కోప్​ ఉందంటే విజయ్​ ఓకే చెబుతుంటాడు. ఇలా తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నాడు విజయ్​ సేతుపతి.

రాక్షసన్​ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్​ చేసిన విషయం తెలిసిందే. బెల్లం కొండ శ్రీనివాస్​ హీరోగా నటించాడు. ఈ మూవీ తమిళంతోపాటు తెలుగులోనూ సూపర్​ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవికి సీక్వెల్​ తీయాలని భావిస్తున్నాడట తెలుగు రీమేక్​ తెరకెక్కించిన రమేశ్​ వర్మ. నిజానికి మాతృక అయిన తమిళంలో ఈ మూవీ సీక్వెల్​ తీయలేదు. కానీ తెలుగులో తీయాలని భావిస్తున్నాడు. రీమేక్​లో హీరోగా విజయ్​ సేతుపతిని తీసుకోబోతున్నట్టు సమాచారం.

ఇప్పటికే దర్శకుడు రమేష్ వర్మ.. చెన్నై వెళ్లి విజయ్​ సేతుపతిని కలిసి కథను వివరించాడు. ఆయనకు కూడా నచ్చేసింది. అయితే ప్రస్తుతం విజయ్​కు డేట్స్​ ఖాళీగా లేవు. మరోవైపు రమేశ్​ వర్మ ప్రస్తుతం రవితేజతో ఖిలాడీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ పూర్తయిన వెంబడే.. రాక్షసుడు 2 కూడా సెట్స్​ మీదకు వెళ్లే చాన్స్​ ఉంది. విజయ్​ సేతుపతిని హీరోగా పెట్టుకుంటే ఈ మూవీ mని పాన్​ ఇండియా లెవెల్​లో విడుదల చేయొచ్చని భావిస్తున్నారట మేకర్స్​. ఈ మూవీ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

Also Read

బోయపాటి కథకు ఫిదా ..! గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన బన్నీ..!

క్లాసిక్ ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్..!

‘ఉస్తాద్’ గా ముందుకొస్తున్న రామ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -