- Advertisement -

దాదా బయోపిక్​కు లైన్​ క్లియర్​.. హీరో ఎవరంటే?

- Advertisement -

బీసీసీఐ అధ్యక్షుడు, బెంగాల్​ టైగర్​, టీమిండియా మాజీ కెప్టెన్​ సౌరవ్​ గంగూలీ బయోపిక్​ త్వరలో రాబోతున్నది. నిజానికి చాలా రోజులుగా దాదా బయోపిక్​ వస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తనమీద బయోపిక్​ చేసేందుకు గంగూలీ ఒప్పుకోలేదు. దీంతో ఈ ప్రాజెక్టుకు అడుగులు పడలేదు. ఇదిలా ఉంటే తాజాగా బయోపిక్​ చేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని దాదా చెప్పడంతో బయోపిక్​ తెరకెక్కబోతున్నది. ఇక బాలీవుడ్​ చాక్లెట్​ బాయ్​ రణబీర్​ కపూర్​ హీరోగా నటించబోతున్నాడు.

అయితే ఈ సినిమా రూ. 200 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కబోతున్నట్టు నేరుగా గంగూలీ ప్రకటించాడు. ఈ సినిమా ప్రస్తుతానికి కేవలం హిందీలో మాత్రమే తెరకెక్కుతున్నది. ఈ సినిమాకు డైరెక్టర్​ ఎవరు? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్​ వర్క్​ కూడా జరుగుతున్నట్టు టాక్​. గంగూలీ గతంలో కొంతకాలం పాటు ప్రముఖ నటి నగ్మాతో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం కూడా బయోపిక్​లో యాడ్​ చేయబోతున్నట్టు సమాచారం.

ఎందుకంటే ఇది పబ్లిక్​ డొమైన్​లో ఉన్న విషయమే. ఇక ఇందులో హీరోయిన్​గా ఎవరు నటించబోతున్నారు? తదితర విషయాలపై క్లారిటీ లేదు. మరోవైపు త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే చాన్స్​ ఉంది. రణ్​బీర్​కు జోడీగా ఎవరు కనిపించబోతున్నారన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

Also Read

ద్రాక్షగుత్తి రూ. 7లక్షలు..! అంత స్పెషల్​ ఏమిటంటే..!

భారత్​లో తొలి కరోనా పేషెంట్​కు మళ్లీ పాజిటివ్​..!

థర్డ్​వేవ్​ తప్పదు.. ఐఎంఏ కీలక ప్రకటన

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -