Thursday, April 25, 2024
- Advertisement -

క్లాసిక్ ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్..!

- Advertisement -

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో భావోద్వేగాలతో కూడిన కథనం ఆకట్టుకుంటుంది. జాతీయ జట్టుకు ఎంపిక కావడం కోసం ఓ ఆటగాడు చేసే పోరాటంతో పాటు, తండ్రి, కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు కట్టిపడేశాయి. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు లో ఓ క్లాసిక్ మూవీ గా నిలిచిపోయింది.

ప్రస్తుతం ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. గౌతమ్ తర్వాత సినిమా రామ్ చరణ్ తో ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ అది కన్ఫర్మ్ కాలేదు. అయితే తాజాగా గౌతమ్ నానితోనే మరో సినిమా చేస్తున్నట్లు టాక్.

ఈసారి కూడా గౌతమ్ మంచి భావోద్వేగాలతో కూడిన కథను ఎంచుకున్నట్లు సమాచారం. యుద్ధ రంగంలో పోరాడి తన కాళ్ళను పోగొట్టుకున్న ఓ వీర సైనికుడి కథతో ఈ సినిమాను గౌతమ్ రూపొందించనున్నారట. భావోద్వేగాలకు పెద్ద పీట ఉన్న ఈ కథ ఆల్మోస్ట్ ఫ్లాష్ బ్యాక్ లోనే నడుస్తుందని సమాచారం. ప్రస్తుతం నాని టక్ జగదీష్,అంటే సుందరానికి,అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత గౌతమ్ తిన్ననూరి సినిమా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

Also Read

బాలయ్య కోసం అనుకున్న టైటిల్ ఎగరేసుకెళ్లాడు..!

టాలెంటెడ్ రైటర్ తో సుధీర్ బాబు మూవీ..!

రామ్ ను ఢీకొట్టే పాత్రలో తమిళ స్టార్ హీరో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -