అమీర్​ఖాన్​పై ఆరోపణలు.. స్పందించిన చిత్ర యూనిట్ ..!

- Advertisement -

బాలీవుడ్ అగ్రహీరో అమీర్​ ఖాన్​ లాల్​సింగ్​ చద్దా అనే ఓ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో టాలీవుడ్​ నటుడు నాగ చైతన్య కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్​ లడఖ్​లోని ఓ ప్రాంతంలో జరిగింది. అయితే అక్కడ షూటింగ్​పై విమర్శలు వచ్చాయి. షూటింగ్ అనంతరం చిత్ర యూనిట్​ వాటర్​ బాటిల్స్​, ఇతర నిరుపయోగ వస్తువులు అక్కడ పడేసి పోయారు. దీన్ని ఓ నెటిజన్​ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.

‘బయట అందరికీ నీతులు చెప్పే అమీర్​ ఖాన్​.. తన మూవీ షూటింగ్​లో మాత్రం ఇలా వాటర్​ బాటిల్స్​ బయటపడేశాడు. ఇదేనా పర్యావరణ పరిరక్షణ. వాఖా గ్రామ ప్రజలకు ‘లాల్‌సింగ్‌ చద్దా’ టీమ్‌ ఇచ్చిన బహుమతి ఇది. ‘సత్యమేవ జయతే’ షోలో పర్యావరణం గురించి అమీర్ మాట్లాడుతుంటారు. కానీ వ్యక్తిగతంగా వచ్చేసరికి షూటింగ్‌ చేసిన ప్రదేశాన్ని అపరిశుభ్రం చేశారు’. అంటూ ఓ నెటిజన్లు కామెంట్లు పెట్టాడు. ఈ వీడియో వైరల్​ గా మారింది.

అమీర్​ ఖాన్​ను పలువురు ట్రోల్​ చేశారు. దీంతో ఎట్టకేలకు చిత్ర యూనిట్​ స్పందించింది. ఈ విషయంపై అమీర్ ఖాన్‌ ప్రొడక్షన్‌ సంస్థ ‘ఏకేపీ’ స్పందిస్తూ.. ‘మేము ఎక్కడికెళ్లినా ఆ లోకేషన్​ను పరిశుభ్రంగా ఉంచుతాం. కావాలంటే మీరు వెళ్లి స్థానికులను అడగండి. లేదంటే అక్కడికి వెళ్లి చెక్ చేసుకోండి. మేము చెత్తను అక్కడ వేశామన్నది అవాస్తవం’ అంటూ సదరు యూనిట్​ పేర్కొన్నది. కాగా ఈ విషయంపై సదరు నెటిజన్​ స్పందిస్తూ.. నేను దురుద్దేశ్యంతో ఈ పోస్టు చేయలేదు. అక్కడ చెత్త ఉన్నది నిజమే. కావాలంటే నేను గతంలో పెట్టిన వీడియో చూసుకోవచ్చు’ అంటూ రిప్లై ఇచ్చాడు.

Also Read

అల్లు అర్హ బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ కన్ఫర్మ్.. అల్లు అర్జున్ ఎమోషనల్ ..!

గర్జించిన రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్..!

చేతినిండా సినిమాలుండే స్టార్ హీరో.. కాలేజ్ డేస్ లో ఏం చేసేవాడో తెలుసా..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -