చైతూకు నో చెప్పిన బేబమ్మ..! రీజన్​ ఏమిటో?

- Advertisement -

ఒక్క సినిమా.. ఒకే ఒక్క. సినిమాతో కృతి శెట్టి రేంజ్​ ఎక్కడికో వెళ్లిపోయింది. కన్నడ భామ కృతి శెట్టి తెలుగులో నటించిన తొలి చిత్రం ఉప్పెన కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కృతికి మంచి క్యారెక్టర్​ దక్కింది. దీంతో ఆమె ఒక్క సినిమాతోనే పాపులర్​ హీరోయిన్​ అయ్యింది. దీంతో ఆమెకు వరస అవకాశాలు తలుపు తట్టాయి. అయితే కృతి మాత్రం ఆచుతూచి సినిమాలు ఎంచుకుంటుంది. ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే ఒప్పుకుంటోంది.

తాజాగా నాగచైతన్యతో నటించేందుకు ఛాన్స్ వచ్చినా కృతి ఒప్పుకోలేదట. డేట్స్​ కుదరకపోవడంతో సున్నితంగా నో చెప్పినట్టు టాక్​. నాగ చైతన్యకు లవర్​బాయ్​గా పేరుంది. తెలుగులో మంచి మార్కెట్ కూడా ఉంది. ప్రస్తుతం నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్​ బంగార్రాజులో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. లీడ్​ రోల్​ చైతూదే అనే టాక్​ కూడా ఉంది.

ఈ మూవీలో చైతూ సరసన నటించేందుకు కృతి శెట్టిని సంప్రదించిందట చిత్ర యూనిట్​. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదని టాక్​. అయితే ప్రస్తుతం కృతి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. రామ్​ పోతినేనితో ఓ మూవీలో చేస్తోంది. నాని హీరోగా నటిస్తున్న శ్యామ్​ సింగరాయ్​లో చేస్తోంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు తదుపరి చిత్రంలో కూడా కనిపించనుంది. బిజీ షెడ్యూల్​ ఉండటంతో చైతూ చేసేందుకు కృతి ఒప్పుకోలేదట. ఒప్పుకోలేదట. ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.

Also Read

రాక్షసుడు సీక్వెల్​లో విజయ్​ సేతుపతి?

తమన్ కి తమనే పోటీ..!

సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి ప్లస్సా.. మైనస్సా..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -