Thursday, May 2, 2024
- Advertisement -

చేతినిండా సినిమాలుండే స్టార్ హీరో.. కాలేజ్ డేస్ లో ఏం చేసేవాడో తెలుసా..!

- Advertisement -

విజయ్​ సేతుపతి ఇప్పుడు పాన్​ ఇండియా స్థాయిలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన డేట్స్​ కోసం.. అన్ని భాషల నిర్మాణ సంస్థలు ఎదురుచూస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టే విజయ్​ కూడా మంచి మంచి పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. నేరుగా తెలుగులో ఉప్పెన చిత్రంలో నటించగా.. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఇక విజయ్​ సేతుపతికి కూడా ఈ చిత్రంలో వేసిన రాయనం పాత్ర ఎంతో పేరు తీసుకొచ్చింది.

కాగా..విజయ్​ మాస్టర్​ చెఫ్​ అనే ఓ టీవీ ప్రోగ్రాంలో యాంకర్​గా చేస్తున్నాడు. ఇటీవల ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ట్రైలర్​ లాంచ్​ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ్​ సేతుపతి మాట్లాడుతూ.. ‘ నాకు వంటలంటే ఎంతో ఇష్టం. నేను జీవితంలో చాలా కష్టాలు పడ్డాను. కాలేజీ రోజుల్లో ఓ ఫాస్ట్​ ఫుడ్ సెంటర్​లో పనిచేసేవాడిని.. సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12:30 గంటలవరకు అక్కడే పనిచేసే వాడిని. అక్కడే భోజనం కూడా చేసేవాడిని.

ఇక నాకు ఇష్టమైన వంట ఉల్లి సమోసా. ప్రస్తుతం ఈ స్నాక్​ ఎక్కడా దొరకడం లేదు. కానీ ఇంట్లో ఉంటే మాత్రం సాయంత్రం పూట ఉల్లి సమోసా తిని ఓ టీ తాగుతా’ అంటూ తన జీవితంలో ఎదురైన ఘటనలను పంచుకున్నాడు విజయ్​ సేతుపతి. మాస్టర్​ చెఫ్​ ప్రోగ్రాంపై తమిళప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం విజయ్​ సేతుపతి హోస్ట్​గా వ్యవహరిస్తుండటమే. ఇక విజయ్​ పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు.

Also Read

నవీన్​ పొలిశెట్టితో మూవీకి నో చెప్పిన స్వీటీ..!

రాధేశ్యామ్​ మరింత ఆలస్యం.. నిరాశలో ఫ్యాన్స్​..!

ఈ వారం ఓటీటీ చిత్రాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -