Friday, March 29, 2024
- Advertisement -

మళ్లీ ఫామ్​లోకి చిన్నారి పెళ్లికూతురు..!

- Advertisement -

చిన్నారి పెళ్లికూతురు సీరియల్​తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికా గోర్​.. చిన్న వయసులోనే సినిమా చాన్స్​ లు దక్కించుకున్నది. మొదటి చిత్రం ఉయ్యాలా జంపాలా హిట్​ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఉయ్యాలా జంపాలా మూవీలో నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పల్లెటూరు మధ్యతరగతి అమ్మాయిగా అవికా ఎంతో సహజంగా నటించింది. బాలనటిగా అనుభవం ఉండటంతో ఆమెకు ఈ పాత్ర ఎంతో ఈజీ అయ్యింది.

అయితే ఆ తర్వాత వరసగా అవకాశాలు వచ్చినప్పటికీ.. ఆమెకు తన నటనను నిరూపించుకొనే అవకాశాలు దక్కలేదనే చెప్పాలి. ఎక్కడకి పోతావు చిన్నవాడా, సినిమా చూపిస్త మావ, లక్ష్మి రావే మా ఇంటికి, తను మను వంటి సినిమాల్లో వరసగా అవకాశాలు దక్కించుకున్నది అవిక. అయితే ఆమెకు స్టార్​ హీరోలకు నుంచి మాత్రం అవకాశాలు దక్కలేదు. బరువు పెరగడం.. వరుసగా సినిమాలు ఫెయిల్ కావడంతో అవికా కెరీర్​ సవ్యంగా ముందుగా సాగలేదు.

అయితే ఇటీవల ఆమెకు మళ్లీ వరుసగా అవకాశాలు వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న థ్యాంక్యూ సినిమాలో చాన్స్​ దక్కించుకున్నది. ఈ సినిమాలో ఆమె చైతూకు జోడీగా కనిపించనుంది. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలోనూ అవికా నటించనున్నది. వీటితోపాటు ఆది హీరోగా చేస్తున్న అమరన్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలు విజయం సాధిస్తే అవికా కెరీర్ ఊపందుకునే అవకాశం ఉంది.

Also Read

రంగం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది?

ఇక చక చకా ఆదిపురుష్​ షూటింగ్​.. ప్రభాస్​ లేకుండానే..!

బడా బ్యానర్లన్నీ సంతోష్ శోభన్ చుట్టే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -