- Advertisement -

‘రాజుగారి గది 4’ కి రెడీ అంటున్న డైరెక్టర్!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు హర్రర్ మూవీస్ అంటే థియేటర్లో భయంతో వణికి పోయేవారు. అయితే విఠలాచార్య సినిమాల్లో దెయ్యం అంటే ఓ కామెడీగా ఉండేది. ఇక రాంగోపాల్ వర్మ దెయ్యాల సినిమా చూస్తే గుండెలు అరచేత్తో పట్టుకోవాల్సిందే. అలాంటి సమయంలో నటుడు, దర్శకుడు లారెన్స్ ముని చిత్రంతో హర్రర్ మూవీ కాన్సెప్ట్ పూర్తిగా మార్చాడు. ఓ వైపు భయపెడుతూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో బాగా ఆకట్టుకున్నాడు. ఇదే కాన్సెప్ట్ తో డైరెక్టర్ ఓంకార్ ‘రాజుగారి గది’ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు.

తన సోదరుడు అశ్విన్ బాబు ప్రధాన పాత్రధారిగా ఆయన తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ మంచి వసూళ్లను రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేసుకుని ఆయన చేసిన ఈ హారర్ థ్రిల్లర్ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రం సీక్వెల్ గా నాగార్జున – సమంత ప్రధాన పాత్రధారులుగా ఓంకార్ రూపొందించిన ‘రాజుగారి గది 2’ ఫరవాలేదనిపించుకుంది. అవికా గోర్ తో చేసిన ‘రాజుగారి గది 3’ మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది.

గత కొంత కాలంగా కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఓంకార్ టీవీ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక త్వరలో ‘రాజుగారి గది 4’ను పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని అంటున్నారు. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయనున్నట్లు సమాచారం.

సతీమణితో క‌లిసి ర‌క్త‌దానం చేసిన మెగాస్టార్ చిరంజీవి

`పీన‌ట్ డైమండ్` ట్రైలర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ క్రిష్

జబర్దస్త్ కమెడియన్‌ హైపర్ ఆదిపై ఫిర్యాదు.. కారణం ఏంటో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -