దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ సినిమా ఎలాంటి విఅజయం సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమ ఇప్పుడు ఐదు వారం లోకి అడుగుపెట్టింది. మొదటి మూడు వారాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. నాలుగో వారానికి వచ్చేసరికి కాస్త వసూళ్లు తగ్గాయి. అయినాగానీ ఇండియన్ సినిమా చరిత్రలో ఏ సినిమా సాధించలేని రికార్డులను సాధించింది.
బాహుబలి 2 ఇప్పటివరకు ఎన్ని రికార్డులు సాధించిందో ఇప్పుడు చూద్దాం..
* మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 292 కోట్ల గ్రాస్.. రూ. 262.9 కోట్ల నెట్. రూ. 187.4 కోట్ల రూపాయల షేర్ ను కలెక్ట్ చేసింది.
* దేశవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు 1279.8 కోట్ల రూపాయలు వసూళు చేసింది.
{loadmodule mod_custom,Side Ad 1}
* వరల్డ్ వైడ్ రూ. 1557.5 కోట్ల గ్రాస్ వసూళు చేసింది.
* ప్రస్తుతం రెండో అతి పెద్ద ఇండియన్ బ్లాక్ బస్టర్ గా బాహుబలి నిలిచింది.
* మొన్నటి వరకు బాహుబలినే ఫస్ట్ ప్లేస్ లో ఉండేది.. చైనాలో దంగల్ అసాధారణమైన వసూళ్లు సాధించి తొలి స్థానానికి దూసుకుపోయింది.
* బాలీవుడ్ రూ. 500 కోట్లు సాధించిన చిత్రంగా బాహుబలి నిలిచింది.
{loadmodule mod_custom,Side Ad 2}
* తమిళనాట కూడా బాహుబలి రూ. 100 కోట్లు సాధించింది.
* దేశంలో 1000 కోట్ల రూపాయల నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను సాధించిన మొదటి చిత్రం.
మొత్తంగా బాహుబలి ఏ సినిమా సాధించని రికార్డులను సాధించి అదరహో అనిపించింది.
{youtube}s13zJNkuxiE{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related