రామ్ చరణ్ పై ప్రయోగం చేస్తోన్న శంకర్.. వర్కౌట్ అయ్యేనా ?

Director Shankar Experiment Movie With Ram Charan
Director Shankar Experiment Movie With Ram Charan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది ” ఆర్ ఆర్ ఆర్ ” తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ నటవిశ్వరూపానికి ఇండియన్ సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో చరణ్ నెక్స్ట్ మూవీపై ఇండియా మొత్తంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ తన తదుపరి సినిమాను శంకర్ ధర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్ లో ” RC15 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. ఇక ఈ మూవీ టైటిల్ కు సంభందించి ఇప్పటికే చాలా రకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. “విశ్వంభర “, “సర్కారోడు ” అనే టైటిల్స్ గట్టిగానే వినిపించాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో టైటిల్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ” అధికారి ” అనే టైటిల్ ను చిత్రయూనిట్ దాదాపుగా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందట.

ఈ సినిమాలో రాంచరణ్ ఐ‌ఏ‌ఎస్ అధికారిగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మరో పవర్ఫుల్ క్యారెక్టర్ ను కూడా శంకర్ డిజైన్ చేశాడట. అది కూడా పూర్తి నెగిటివ్ క్యారెక్టర్ అని సమాచారం. దాంతో రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ చేస్తున్నాడనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. అయితే రామ్ చరణ్ ఇప్పటియవరకు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ఎప్పుడు కనిపించలేదు. దాంతో నెగిటివ్ షెడ్ లో రాంచరణ్ ఎలా ఉంటాడనన్న ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇక తన సినిమాలతో బిగ్గెస్ట్ ఇండియన్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న శంకర్.. గత రెండు చిత్రాలతో ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాడు. విక్రమ్ తో తీసిన ” ఐ ” పూర్తి నిరాశ పరచగా, రజినీకాంత్ తో తీసిన ” రోబో 2.0 ” కాస్త పరవలేదనిపించింది. దాంతో శంకర్ ఈ సారి చరణ్ తో తీయబోయే మూవీతో అదిరిపోయే హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. మరి రాంచరణ్ తో శంకర్ ఎలాంటి సంచలనలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Also Read

రాజమౌళి.. తెలుగు సినీ “చరిత్రకోకడు”

బాలయ్య, బోయపాటి.. ఈసారి ఇండియా షేక్ అవ్వాల్సిందే !

“పుష్ప 2 ” ప్లాన్ మొత్తం మారిందా ?