Monday, May 6, 2024
- Advertisement -

‘బాహుబలి 2’ ట్రైలర్‌ రివ్యూ

- Advertisement -
Bahubali 2 Trailer Review

ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి ఎలాంటి విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి 2’ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ట్రైలర్‌ ఎడిటింగ్‌ పూర్తి అయ్యింది.

రెండున్నర నిమిషాల నిడివితో ఈ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్‌ను తనకు ఆప్తులు అయిన వారికి జక్కన్న చూపిస్తున్నాడు. తాజాగా రాజమౌళి తన సోదరుడు అయిన సంగీత దర్శకుడు కళ్యాణ్‌ మాలిక్‌కు ట్రైలర్‌ను చూపించాడట. ట్రైలర్‌ చూసిన తర్వాత కళ్యాణ్‌ మాలిక్‌ షాక్‌కు గురయ్యాడట. ట్రైలర్‌ చూసిన తర్వాత ఆయన సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ… ‘ఇప్పుడే బాహుబలి 2 ట్రైలర్‌ చూశాను. అది చూస్తున్నప్పుడే నా గుండె అదిరిపోయింది.

సినిమా కంటే ముందు ఈ ట్రైలరే వంద రోజులు ఆడేలా అనిపిస్తుందంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ ట్రైలర్‌ రికార్డులు బద్దలు కొడుతుందని చెప్పుకొచ్చాడు. ట్రైలర్‌ ఈ స్థాయిలో ఉంటే.. సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకుంటనే అద్బుతం అనిపిస్తుందని ఆయన పేర్కొన్నాడు.  ఈయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో బాహుబలి 2 ట్రైలర్‌పై చర్చ మొదలైంది. ఎప్పుడెప్పుడు ఈ ట్రైలర్‌ చూస్తామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా వచ్చే నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. 

Related

  1. బాహుబలి-2 ట్రైలర్ ఎప్పుడంటే..?
  2. బాహుబలి-2లో మరో హీరోయిన్.. ఆమె పాత్ర ఏంటంటే?
  3. ప్రభాస్ అసలు బాహుబలి చేయడానికి ముఖ్య కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!
  4. బాహుబలి కొత్త ఫోటో అదిరింది.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -