Saturday, April 20, 2024
- Advertisement -

సింహా, లెజెండ్ ని మించేలా.. యాక్షన్ సీక్వెన్స్ కోసమే 80 రోజులు..!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ బోయపాటి సినిమాలు అంటే చాలు హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలు గుర్తుకొస్తాయి. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్ అయ్యాయి. వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ తో బాలకృష్ణ రేంజ్ మరో స్థాయికి చేరుకుంది. సింహా, లెజెండ్ సినిమాల్లో యాక్షన్ ఘట్టాలు అదిరిపోయేలా బోయపాటి శ్రీను తెరకెక్కించారు. నందమూరి అభిమానులకు ఈ సినిమాలు బాగా నచ్చాయి.

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందువల్లే అఖండ టీజర్ కు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కాగా ఈ మూవీలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. జగపతిబాబు ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఇందులో అగోర పాత్ర ఒకటి.

అఖండ సినిమాలో కూడా సింహా, లెజెండ్ మాదిరే యాక్షన్ ఘట్టాలకు ప్రాధాన్యం ఉంది. ఓన్లీ ఈ సినిమాలో ఫైట్ చిత్రీకరణ కోసమే 80 రోజులు కేటాయించారు అంటే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం అవుతుంది. అఖండ ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ లు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని తెలుస్తోంది. ఇటీవల తమిళనాడులో జరిగిన షూటింగ్ తో ఈ చిత్ర షూటింగ్ ముగిసింది. కేవలం 10 రోజుల్లో ప్యాచ్వర్క్ మినహా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయింది. ఆగస్టు 15 సందర్భంగా అఖండ మొదటి సింగల్ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Also Read

నిశ్చితార్థంపై ప్రచారం నిజమే.. త్వరలోనే నయనతార పెళ్లి..!

దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..!

దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -