మరోసారి కబాలి కాంబో?

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యువ దర్శకుడు పా.రంజిత్ డైరెక్షన్లో మరో సినిమా రానున్నట్లు కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పా. రంజిత్ దర్శకత్వంలో రజినీకాంత్ ఇప్పటికే రెండు సినిమాల్లో నటించారు. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన కబాలి, కాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మొత్తం రజినీకాంత్ సిరుతై శివ దర్శకత్వంలో అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్నాడు. సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది.

కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల రజనీకాంత్ డబ్బింగ్ చెప్పేందుకుగాను ఓ స్టూడియోకు రాగా అదే స్టూడియోలో ఉన్న పా. రంజిత్ రజినీకాంత్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఓ సెల్ఫీ తీసుకున్నారు. దీనిని పా. రంజిత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.

- Advertisement -

దీంతో వారిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రానున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. పా.రంజిత్ ఇటీవల హీరో ఆర్యతో తీసిన సార్బట్టా పరంపరై సూపర్ హిట్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. సరైన హిట్ లేని ఆర్య,పా.రంజిత్ లకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి రజనీ – రంజిత్ కాంబినేషన్ లో మరో సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Also Read

ఇతడు కదా.. బాలయ్యకు సరైన విలన్..!

‘మా’ ఎన్నికలు జరపండి ..

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా…

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -