నిశ్చితార్థంపై ప్రచారం నిజమే.. త్వరలోనే నయనతార పెళ్లి..!

- Advertisement -

నయనతార 35 ఏళ్ల వయసు దాటినా ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో దూసుకెళుతోంది. సౌత్ లో ఏ హీరోయిన్ తీసుకోనంత రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. కాగా నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ కలిసి ఓకే ఇంట్లోనే ఉంటున్నారు. వారి పెళ్లి అతి త్వరలోనే జరగనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వారిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిందని ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ వార్తలే నిజమయ్యాయి.

చాలా రోజుల నుంచి నయనతార చేతికి ఉంగరం ఉంది. దీంతో ఆమెకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఇది నిజమని తేలింది. తొలిసారి ఓ తమిళ టీవీ ఛానల్ టాక్ షోలో తన ప్రేమ, నిశ్చితార్థం గురించి నయనతార తొలిసారిగా స్పందించారు. తన వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని చూపిస్తూ ఇది తన ఎంగేజ్మెంట్ రింగ్ అని ఆమె చెప్పారు. దీనిని బట్టి చాలా రోజుల కిందటే విగ్నేష్ శివన్ నయనతారకు ఎంగేజ్మెంట్ జరిగి ఉంటుందని అర్థం అవుతోంది.

- Advertisement -

కాగా నయనతార మొదట కోలీవుడ్ స్టార్ హీరో శింబును లవ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత నయనతార డ్యాన్స్ మాస్టర్, ప్రముఖ నటుడు ప్రభుదేవాను ప్రేమించింది. వీరిద్దరి మధ్య ప్రేమ పెళ్లి కబురు వరకు వచ్చింది. సినిమాలు మానేసి పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా నయనతార ప్రకటించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. అనూహ్యంగా వారిద్దరూ విడిపోయారు. ఇది జరిగిన కొన్నళ్ళ తర్వాత నయనతార విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. అతి త్వరలోనే వీరి పెళ్లి జరుగనుంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -