దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..!

- Advertisement -

చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారు తెలియదు. సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించిన నటీ, నటులు నిజ జీవితంలో కూడా ప్రేమలో పడి పెళ్లిలు చేసుకున్నరు. మరి కొందరు దర్శకుని ప్రేమలో పడి పెళ్లిచేసుకున్న వారు కూడా ఉన్నారు. అలా ఇండస్ట్రీలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

మణిరత్నం, సుహాసిని : టాలీవుడ్ టాప్ యాక్ట్రస్ లో ఒకరైన సుహాసినిని స్టార్ డైరెక్టర్ అయిన మణిరత్నం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

- Advertisement -


సుందర్, కుష్బూ : హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించిన కుష్బూ, తమిళ డైరక్టర్ సుందర్. సి. బాబుని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇద్దరూ సినీ రంగంలో కొనసాగుతున్నారు.


సెల్వమణి, రోజా : రోజా సినిమాల్లో హీరోయిన్ గా మంచి ఫామ్లో ఉన్న సమయంలో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న సెల్వమణితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది.

కృష్ణవంశీ, రమ్యకృష్ణ : పెళ్ళికి ముందు రమ్యకృష్ణ, కృష్ణవంశీ దర్శకత్వంలో నటించకపోయినప్పటికీ ఇద్దరూ తరచూ కలుసుకొని కబుర్లు చెప్పుకోవడం ద్వారా దగ్గరయ్యారు. తర్వాత భార్యాభర్తలయ్యారు.


సూర్యకిరణ్, కళ్యాణి : కేరళలో పుట్టి చెన్నైలో సెటిల్ అయిన డైరక్టర్ సూర్యకిరణ్ ని పెదబాబు సినిమా షూటింగ్ లొకేషన్లో కలిశారు. అప్పుడు మొదలైన వీరి ప్రేమ స్టోరీ పెళ్లి పీటలవరకు వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరికి కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు.


భాగ్యరాజ్, పూర్ణిమ : నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కి మొదట ప్రవీణ అనే ఆమెతో పెళ్లి అయింది. ఆమె చనిపోవడంతో నటి పూర్ణిమను పెళ్లిచేసుకున్నారు. వీరిద్దరూ “డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్” సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించారు. అప్పుడే ప్రేమలో పడి జీవిత భాగ్యస్వాములయ్యారు.

సురేష్ మీనన్, రేవతి : తమిళ డైరక్టర్ సురేష్ మీనన్, కేరళ నటి రేవతిలది కూడా ప్రేమ వివాహమే. 1986 లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న వీరు పదహారేళ్లు కలిసి జీవించిన తర్వాత విడాకులు తీసుకున్నారు.


సెల్వ రాఘవన్, సోనియా అగర్వాల్ : 7 /జి బృందావన్ కాలనీని సెల్వ రాఘవన్ డైరక్ట్ చేయగా, అందులో సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడం, పెళ్లి దాకా వెళ్లిపోవడం జరిగిపోయింది. అయితే రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు.


విజయ్, అమలాపాల్ : దైవ తిరుముగల్ (నాన్న) సినిమా సమయంలో విజయ్, అమల పాల్ కి మధ్య ప్రేమ మొదలయింది. 2014 లో పెళ్లిచేసుకున్నారు. రెండేళ్లపాటు కూడా సజావుగా సంసారం చేయకుండా కోర్టుకెళ్లి 2016 లో విడాకులు తీసుకున్నారు.

Also Read: ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -