Saturday, May 4, 2024
- Advertisement -

చిరును వెనక్కి నెట్టిన బాలయ్య!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ మద్య ఎప్పుడు కూడా ఒక రసవత్తరమైన పోటీ నడుస్తున్నే ఉంటుంది. తమ హీరో గొప్ప అంటే తమ హీరోనే గొప్ప అని వీరిద్దరి అభిమానులు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఇక ఈ ఇద్దరి హీరోల సినిమాలు ఒకే సారి రిలీజ్ అయితే అభిమానులు చేసే రచ్చ మామూలుగా ఉండదు. వచ్చే ఏడాది ఈ ఇద్దరు స్టార్ హీరోలు వారి కొత్త సినిమాలతో బరిలోకి దిగబోతున్నారు. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నాయి. దీంతో ఈ రసవత్తరమైన పోరు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. .

ఇక ఈ రెండు మూవీస్ నుంచి తాజాగా లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. చిరంజీవి ” బాస్ పార్టీ ” అంటూ అదిరిపోయే మాస్ సాంగ్ తో రచ్చ చేయగా.. బాలకృష్ణ ” జై బాలయ్య ” అనే మాస్ ఆన్ తం తో దుమ్ములేపుతున్నాడు. ఇక చిరు ” బాస్ పార్టీ ” సాంగ్ కు అదిరిపోయే మాస్ బీట్ అందించారు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. ఇక జై బాలయ్య సాంగ్ కు సౌండ్ బాక్స్ లు బద్దలయ్యే ట్యూన్ సమకూర్చారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. అయితే యూట్యూబ్ రికార్డ్స్ పరంగా చూసుకుంటే చిరు పై బాలయ్యనే పై చేయి సాధించినట్లు తెలుస్తోంది.

వాల్తేరు వీరయ్య నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన 24 గంటల్లో 5 లక్షలకు పైగా వ్యూస్ సాధిస్తే.. వీరసింహారెడ్డి నుంచి వచ్చిన ” జై బాలయ్య ” సాంగ్ కేవలం 18 గంటల్లోనే 5 లక్షల వ్యూస్ ను దాటేసింది. దీంతో లిరికల్ సాంగ్స్ పరంగా బాలయ్యనే పైచెయ్ సాధించాడు. ఇక కేవలం హీరోల విషయంలోనే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్స్ మద్య కూడా ఈ రెండు సినిమాలతో పోటీ నెలకొంది. దేవి శ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ థమన్ టాలీవుడ్ లో కొన్నాళ్లుగా టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. దాంతో ఈ సంక్రాంతి అటు హీరోలకుమ ఇటు మ్యూజిక్ డైరెక్టర్స్ కు మద్య గట్టి పోటీనే ఉంటుందంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

విజయ్ దెబ్బకు దిల్ రాజు విలవిల!

అందరి దృష్టి సమ్మర్ పైనే !

మలయాళ మూవీనే దిక్కు అంటున్న నాగ్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -