Friday, May 17, 2024
- Advertisement -

రౌడీ సేన కాదు.. విప్లవ సేన : పవన్ కల్యాణ్!

- Advertisement -

ఆ మద్య విశాఖలో చోటు చేసుకున్నా ఘటన తరువాత వైసీపీ నేతలు తరచూ జనసేన పార్టీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. కాస్త వీలు దొరికిన పవన్ పై విమర్శలు చేయడానికే సమయం కేటాయిస్తున్నారు. వైసీపీ నేతలు జనసేనపై ఈ స్థాయిలో ఫోకస్ చేయడానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం జనసేన గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. ప్రజల్లో కూడా జనసేనపై కాస్త సానుకూలత కనిపిస్తుండడంతో అలర్ట్ అయిన వైసీపీ నేతలు.. జనసేన దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. పవన్ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నాడని, పవన్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటూ గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు.

ఇక విశాఖ ఘటనలో జనసైనికులు తమపై దాడికి పాల్పడ్డారని, పవన్ ప్రత్యక్ష దాడులను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ నేతలు గట్టిగా ఆరోపించారు. పవన్ పార్టీ పేరు జనసేన కాదు రౌడీసేన అంటూ విమర్శనస్త్రాలు సంధించారు. అయితే తాజాగా ఇప్పటం గ్రామ ప్రజలకు పరిహారం అందించేందుకు వచ్చిన పవన్.. తమ పార్టీ రౌడీ సేన కాదు విప్లవ సేన అంటూ వైసీపీ నేతలకు ఘాటుగా రీప్లే ఇచ్చారు పవన్. వైసీపీకి 175 కి 175 సీట్లు ఇవ్వడానికి తాము నోట్లో వేలు పెట్టుకోని కూర్చోలేదని అన్నారు. ఒక్కసారి అద్భుతమైన అవకాశం ఇచ్చి 151 సీట్లు కట్టబెడితే మిరెమ్ చేశారని ప్రశ్నించారు. తనను ఎంతో అభిమానించే తన అభిమానులు కూడా వైసీపీకే ఓటు వేశారని, ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇప్పటం గ్రామంలో ఇల్లు నష్టపోయిన వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున.. 39 మందికి పరిహారం అంధించారు పవన్. ఇప్పటం గ్రామంలో గడపలు కూల్చిన వైసీపీని కూల్చే వరకు నిద్రపోయేది లేదని పవన్ తనదైన రీతిలో వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

జగన్ను కాపీ కొడుతున్న బాబు!

రోజాను పందితో పోల్చిన కే‌ఏ పాల్ !

పాపం కాంగ్రెస్ పరిస్థితి ఎందుకిలా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -