నందమూరి అభిమానులు పండగా చేసుకుంటున్నారు. బాలకృష్ణ అభిమానులు ఎంతాగానో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు.
బాలయ్య వందో చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలూ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ బ్రహ్మాండమైన స్పందనను దక్కించుకోగా ఈరోజు సాయంత్రం 2 నిముషాల 11 సెకన్ల ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలలోని వంద థియేటర్లలో ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. వార్ ఎపిసోడ్స్ నుండి.. రొమాంటిక్ సీన్స్ వరకు.. సెంటిమెంట్ నుండి ఉద్రేకం వరకు.. చాలా అద్భతంగా ఉందీ ట్రైలర్.
క్రియేటివ్ డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ”గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవ్వనుంది. అసలు ఇంత స్పీడు ఒక గ్రాఫిక్స్ సినిమాను రూపొందించడం.. దానిని రిలీజ్ కు రెడీ చేయడం అనేదే నిజంగానే అద్భుతమైన హార్డ్ వర్క్ అని చెప్పాలి. అందుకు మనం క్రిష్ ను అభినందించాల్సిందే. ట్రైలర్ ను మీరు చూడండి.
{youtube}kYxP_WbF2O0{/youtube}
Related
