Wednesday, May 15, 2024
- Advertisement -

14 రూపాయలకే అన్ లిమిటెడ్ కాల్స్‌

- Advertisement -
rs 14 unlimited voice calls

జియో రావడంతో.. టెలికాం కంపినీలకు గట్టి దెబ్బ తగిలింది. జియో ఆఫర్స్ తో టెలికం కంపెనీలు ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. వాటికి ధీటుగా జియో త‌న ఉచిత వెల్ కం ఆఫ‌ర్‌ను రోజు రోజుకు పొడిగిస్తూ పోతోంది. జియో ముందుగా ఫ్రీ వెల్ కం ఆఫ‌ర్‌ను డిసెంబ‌ర్ 31 నుంచి వ‌చ్చే యేడాది మార్చి 31 వ‌ర‌కు పెంచింది. అయితే  మిగిలిన టెలికం కంపెనీలు భారీ ఆఫ‌ర్ల‌కు దించాయి.. దాంతో జియో ఉచిత వెల్ కం ఆఫ‌ర్ ఏకంగా మే 31 వ‌ర‌కు పొడిగించేసింది.

ఈ నెపథ్యంలో జియో దెబ్బ‌కు ఎయిర్ సెల్ ఓ సూప‌ర్ ఆఫ‌ర్ ప్రకటించింది. ఇప్ప‌టికే, ఎయిర్‌టెల్‌, ఐడియా, వోడాఫోన్, బీఎస్ఎన్ఎల్‌ వంటి ఇత‌ర కంపెనీలు త‌క్కువ డబ్బులకే ఆఫర్స్ ఇస్తున్నాయి. ఈ వరసలోకి ఇప్పుడు ఎయిర్‌సెల్ వచ్చి చేరింది. ఏకంగా రెండు టారిఫ్ రేట్ల‌ను ప్ర‌క‌టించింది ఎయిర్‌సెల్‌.

ఈ బంప‌ర్ ఆఫ‌ర్ల‌లో 14 రూపాయ‌ల‌కే అన్ లిమిటెడ్ వాయ‌స్ కాల్స్ చేసుకోవ‌చ్చు. ఇండియాలో ఏ నెట్ వ‌ర్క్‌కు అయినా ఫ్రీగా కాల్ చేసుకోవ‌చ్చు. అయితే దీని వ్యాలిడిటీ కేవ‌లం ఒక రోజు మాత్ర‌మే ఉంటుంది. ఇక మ‌రో ఆఫ‌ర్ ఏంటంటే రూ.249 ప్యాక్‌. ఈ ఆఫ‌ర్‌తో నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవ‌చ్చు. ఈ ఆఫ‌ర్‌లో దేశంలో ఏ నెట్ వ‌ర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవ‌చ్చు. ఇంకోవైపు, 1.5 జీబీ డేటా కూడా ఫ్రీగా ఇస్తోంది.

Related

  1. అతి తక్కువ దరకే ఎయిర్‌టెల్ 10 జీబీ డేటా!
  2. రిలయన్స్ జియో మరో అదిరిపోయే ఆఫర్!
  3. జియోకి షాక్ ఇచ్చిన కేంద్రం!
  4. BSNL ఆఫర్ తో జియో కి దిమ్మతిరిగింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -