Saturday, May 18, 2024
- Advertisement -

‘వకీల్ సాబ్’ కథ ముందుగా ఆ హీరోకే వినిపించారట.. కానీ

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో కొన్ని సార్లు సూపర్ హిట్ చిత్రాలు మీస్ చేసుకున్న టాప్ హీరోలు ఎంతో మంది ఉన్నారు.. అదే సమయంలో అట్టర్ ఫ్లాప్ చిత్రాలు ల నుంచి తప్పించుకున్న హీరోలు కూడా ఉన్నారు. తాము మిస్ అయిన హిట్ చిత్రాల గురించి అయ్యో అని బాధపడితే.. ఫ్లాప్ చిత్రాల నుంచి తప్పించుకున్నందుకు తెగ సంతోష పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత నటించిన చిత్రం వకీల్ సాబ్. దిల్ రాజ్ నిర్మాణ సారథ్యంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ ‘పింక్ ’ రిమేక్.

వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించింది. ఇంకా ఈ సినిమా దూసుకుపోయేదే. అయితే కరోనా ఎఫక్ట్ వలన థియేటర్ల దగ్గర జనం పలచబడుతూ వచ్చారు. పవన్ జోష్ ఎంతమాత్రం తగ్గలేదని నిరూపించిన సినిమా ఇది. ఆయన అభిమానులకు పూర్తిస్థాయి సంతృప్తిని ఇచ్చిన చిత్రంగా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాను గురించి తాజాగా ఒక వార్త వినిపిస్తోంది. బాలీవుడ్ లో హిట్ అయిన పింక్ రిమేక్ చిత్రాన్ని గురించి ప్రస్తావించినపుడు ముందుగా బాలకృష్ణను కలిశారట.

కథ విన్న బాలకృష్ణ అంతగా ఆసక్తిని చూపలేదట. అంతే కాదు ఆ పాత్రకు తాను సరైన న్యాయం చేయలేనని అన్నట్లు సమాచారం. ఆ తరువాత ఈ కథను గురించి త్రివిక్రమ్ దగ్గర దిల్ రాజు ప్రస్తావించారట. అప్పుడు పవన్ రీ ఎంట్రీ ఆలోచన గురించిన చెప్పిన త్రివిక్రమ్, ఆయనకి ఈ కథను వినిపించమని చెప్పారట. మూడేళ్ల తర్వాత మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం కావడంతో పవన్ కళ్యాణ్ కూడా ఆసక్తి చూపించడం.. ‘వకీల్ సాబ్’ గా ప్రేక్షకుల ముందుకు రావడం.. హిట్ కొట్టడం జరిగింది.

మోనాల్ అంటే అఖిల్ కు అంతా ప్రేమా? వామ్మో!

బాలయ్యతో నటించాలంటే భయపడ్డనంటున్న బ్యూటీ..?

ప్లీజ్.. జాగ్రత్తగా ఉండండి అంటున్న మెగాస్టార్ చిరంజీవి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -