Thursday, April 25, 2024
- Advertisement -

ప్లీజ్.. జాగ్రత్తగా ఉండండి అంటున్న మెగాస్టార్ చిరంజీవి?

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ ఏ స్థాయిలో వ్యాపించి ఉందో మనకు తెలిసిందే. ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే వైరస్ ను కట్టడి చేయాలని తగినన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి ప్రజలలో ఈ మహమ్మారి పట్ల అవగాహన కల్పిస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా కారణంగా దేశం పై ఏర్పడిన పరిస్థితులను గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ముందుగా తమను తాము రక్షించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సెకండ్ వేవ్ తీవ్రత ఎంతో ప్రమాదకరంగా ఉంది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది పోరాడుతుంటే మరికొంత మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ విధంగా మన ఆత్మీయులను కోల్పోయామనే మాటలు వింటే గుండె తరుక్కుపోతుందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.

Also read:ఎన్టీఆర్ సినిమాలో మహేష్ బ్యూటీ.. ఎవరంటే?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వైరస్ వ్యాధి అధికంగా ఉండడంతో లాక్ డౌన్ ప్రకటించారు. కనుక ఎవరూ అనవసరంగా ఇంటి నుంచి బయటకు రాకూడదని, తప్పని పరిస్థితులలో బయటికి వచ్చిన మాస్క్ ధరించాలని, ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేయించుకుని వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఒకవేళ పాజిటివ్ వస్తే ఐసోలేష‌న్‌కి వెళ్లి డాక్టర్ల సలహాలు తీసుకోవాలని, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయడం వల్ల మరెంతో మందికి ప్రాణదానం చేసిన వారవుతారని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

Also read:ఇంట్లో ఆకలి బాధలు అంటున్న హీరోయిన్.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -