Monday, April 29, 2024
- Advertisement -

దొంగతనం చేస్తూ పట్టుబడిన నటి.. విచారణలో నమ్మలేని నిజాలు

- Advertisement -

దొంగతనం చేస్తూ బెంగాలీ నటి పట్టుబడటం సంచలనంగా మారింది. కోల్కతాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో నటి రూపా దత్ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడింది. జనం దృష్టి మరల్చి ఎంతో చాకచక్యంగా వారి పర్స్ కొట్టేసినట్లు తేలింది. ఇలా కొట్టేసిన పర్సులను చెత్త కుండీలో వేస్తూ అడ్డంగా దొరికిపోయింది.

ఆమె ఈ పని చేస్తుండగా ఉత్తర బిధాన్నగర్ పోలీసు అధికారి చూసి రూపా దత్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. పోలీసుల అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారికి అనుమానం కలిగింది. ఆమె బ్యాగ్ తనిఖీ చేయడంతో రూ. 75 వేల నగదుతో పాటు చాలా పర్స్లు లభ్యమయ్యాయి. కాస్త పాపులారిటీ వచ్చిన నటి అయి ఉండి.. ఇలా దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అధికారులకు అర్థం కాలేదు.

ఈ వ్యవహారం వెనుక ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేపట్టారు. బెంగాలీలో కొన్ని సీరియల్స్ లో నటించిన రూపా దత్.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రముఖ నిర్మాత అనురాగ్ కశ్యప్ పై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వారిలో రూపా కూడా ఉంది. ఇలా ఓ నటి దొంగతనం చేస్తూ పట్టుబడిన వ్యవహారం బెంగాల్ లో హాట్ టాపిక్ గా మారింది.

మహేశ్‌కు విలన్‌గా విక్రమ్… మ్యాజిక్ చేయబోతున్న త్రివిక్రమ్

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

మహేశ్‌ బాబుతో రాజమౌళి సినిమా… రిలీజ్ ఎప్పుడంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -