Friday, April 19, 2024
- Advertisement -

మహేశ్‌ బాబుతో రాజమౌళి సినిమా… రిలీజ్ ఎప్పుడంటే ?

- Advertisement -

రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌తో బిజీబిజీగా ఉన్నాయి. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ మూవీపై అసాధారణమైన అంచనాలు నెలకొన్నాయి. సౌత్ స్టార్స్‌తో పాటు బాలీవుడ్ హాలీవుడ్ స్టార్స్ నటించిన ఆర్ఆర్ఆర్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ సృష్ఠించడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమాను పూర్తి చేసిన వెంటనే జక్కన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోతున్నట్లు సమాచారం.

ఆ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ఈ ఏడాదే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం ఆయన తండ్రి, అగ్ర రచయిత – దర్శకుడు విజయేంద్ర ప్రసాద్..సూపర్ స్టార్ మహేశ్ మూవీ కోసం పాన్ ఇండియా స్థాయి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ప్రముఖ నిర్మాత, శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత డా. కె.ఎల్. నారాయణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.

అయితే, తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను 2024 విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు కూడా ఇప్పటి నుంచే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మహేశ్ ఇప్పుడు చేస్తున్న సర్కారు వారి పాట చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను చేస్తారు. ఆ సినిమా అనంతరం మహేశ్ డేట్స్ మొత్తం రాజమౌళి సినిమాకే కేటాయించారని తెలుస్తోంది.

రెమ్యూన‌రేష‌న్ భారీగా పెంచేసిన ప్రియామ‌ణి

దీపం ఉండగానే చక్కబెట్టుకుంటున్న కన్నడ బ్యూటీ

మనసులో మాట బయటపెట్టిన సామ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -