Friday, March 29, 2024
- Advertisement -

డాల్బి టెక్నాలజీతో విడుదలవుతున్న ఆర్ఆర్ఆర్

- Advertisement -

రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్ లో విడుదలవుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇంతవరకు ఏ తెలుగు సినిమాకు దక్కని ఘనత ట్రిపుల్ ఆర్ సొంతం చేసుకోబోతోంది. సౌదీ అరేబియాలో ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్కడ ..24వ తేదీ నుంచే ప్రీమియర్ షోలతో అలరించేందుకు సిద్ధమవుతోంది.

అంతేకాదు డాల్బీ ఫార్మాట్లో రిలీజ్ కానున్నతొలి భారతీయ సినిమాగానూ ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. 197 డాల్బీ స్క్రీన్స్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హియరింగ్ అండ్ విజువల్ ఎఫెక్ట్ పరంగా మంచి అనుభూతిని ఇవ్వడానికి డాల్బీ సినిమా టెక్నాలజీని వాడబోతున్నారు. ఓవర్సీస్ లో ఐమ్యాక్స్ లాంటి పెద్ద ఫార్మేట్స్ లో సినిమాను ప్రదర్శించడానికి ఈ సాంకేతికను వాడతారు. దాంతో ట్రిపుల్ ఆర్ పై అంచనాలు మరింతగా పెరగాయి.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో విశేషం ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ ఉన్నయూకేలో ఈ సినిమా ప్రీమియర్ షోను ప్రదర్శించనున్నారు. ఆలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలుగా అలరించనుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్, తమిళ నటుడు సముద్రఖని, నటి శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య తెరకెక్కిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురంభీంలు స్వాతంత్ర్య పోరాటానికి ముందు ఎలా ఉండేవారనే ఊహాజనిత కథాంశంతో ఈ సినిమాను తెరకెస్తుండటం విశేషం.

స్టార్ యాంకర్ సుమ షాకింగ్ రెమ్యూనరేషన్

సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

పూర్తిగా మారిపోయిన మీరా జాస్మిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -