విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమా తర్వాత తీస్తున్న సినిమా సైతాన్ (తెలుగులో బేతాళుడు). ఈ సినిమాని రిలీజ్ కు ముందే పది నిమిషాల సినిమాను ప్రెస్ వాళ్లకు చూపించేయడం సాహసమే. ఈ సినిమా ఆడియో వేడుకలో తొలి పది నిమిషాల సినిమాను ప్రదర్శించాడు.
ఇప్పుడు ఆ పది నిమిషాల వీడియోను అందరికీ చూపించేస్తున్నాడు. తమిళ వెర్షన్ వీడియోను యూట్యూబ్ లో పెట్టేశాడు కూడా. ఇంతకీ ఆ పది నిమిషాల్లో ఏముందంటే.. విజయ్ ఆంటోనీ ఓ పెద్దింటి కుర్రాడు. చదువుకుని మంచి స్థితిలోనే ఉంటాడు. కానీ అతణ్ని ఏదో ఒక మానసిక సమస్య వేధిస్తూ ఉంటుంది. రైలు పట్టాల మీద తనను కుర్చీలో పెట్టి కట్టేసినట్లు.. తనను రైలు గుద్దేస్తున్నట్లు ఊహించుకుని భయపడిపోతుంటాడు. అలాగే అతను చదువుకున్న స్కూల్లో జయలక్ష్మి అనే టీచర్ గురించి కూడా అతను తెగ భయపడుతుంటాడు. ఎక్కడికి వెళ్లినా అతణ్ని ఆమె వెంటాడుతుంటుంది.
తండ్రితో కలిసి కార్లో వెళ్తున్నవాడు కిందికి దిగి ఆర్టీసీ బస్సు ఎక్కేస్తాడు. బస్సులో ఉన్న వాళ్లంతా అతడి వైపు అదోలా చూస్తారు. తండ్రి ఆ బస్సును వెంటాడి విజయ్ ఆంటోనీని పట్టుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక పాట కూడా వస్తుంది. ఇదీ తొలి పది నిమిషాల్లో నడిచే కథ. ఇంత వరకు చూస్తే ‘బేతాళుడు’ ఆసక్తికరంగానే ఉండేలా కనిపిస్తోంది. ఇంకొన్ని రోజుల్లో తెలుగు వెర్షన్ వీడియో కూడా రిలీజ్ చేస్తారట. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
{youtube}UeBJbuL7aS0{/youtube}
{youtube}-92RKjy9lXs{/youtube}
Related