Friday, April 26, 2024
- Advertisement -

గుడ్డు పెంకును పారేస్తున్నారా…దాని విలువ తెలుసుకుంటె ఆప‌ని చేయ‌రు..

- Advertisement -

ఈ ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. ఇది శాకాహార‌మా…. లేక మాంసాహార‌మా అన్న వాద‌న‌లు ప‌క్క‌న‌పెడితే ..వీటి వ‌ల్ల ఎక్క‌వ మందికి తెలియ‌ని ఒ కీల‌క ప్ర‌యేజ‌నాన్ని ఇప్పుడు తెలుసుకందాం.

సాదార‌నంగా గుడ్లును అమ్లేట్ వేసుకున్నా,ఉడ‌కేసినా దాని మీద‌రున్న పెంకును ప‌క్క‌న ప‌డేస్తాం కాని దావివ‌ల్ల ఉన్న ఉప‌యేగాలు తెలిస్తే అస్స‌లు దాన్ని వ‌దిలిపెట్ట‌రు.

గుడ్లలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రోటీన్లు, కాల్షియం, ఇతర దాతువులు ఇందులో మిలితమై ఉంటాయి. మనం తీసుకున్న ఆహారంలో ఒక్క గుడ్డుకు మాత్రమే బయోలాజికల్ విలువ నూటికి నూరు శాతం విలువ ఉంటుంది.అయితే గుడ్డుపొట్టును మనం స్వీకరిస్తే శరీరానికి కావలసిన కాల్షియం లభిస్తుంది. దీని ద్వారా ఎముకలు, దంతాలకు అవసరమైన అధిక కాల్షియంతో మనం మరింత ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.

ఇవి తెలియ‌క అంద‌రూ పొట్టును పార‌వేస్తుంటాం. కాని నేరుగా తీసుకోకుండా గుడ్డుపొట్టును పొడిగా చేసుకుని ప్రతిరోజు సగం టేబుల్ స్పూన్ తీసుకుంటే ఆ రోజుకు మనకు కావల్సిన కాల్షియంలో 90 శాతం అందుతుంది. 1000 నుంచి 1500 మిల్లీగ్రాముల కాల్షియం ఎముకలు, దంతాలకు అందుతుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అవసరమైనప్పుడు ఈ విధంగా సగం టేబుల్ స్పూన్ పొడిని తీసుకుంటే కాల్షియం సమస్య త్వరగా తొలగిపోతుంది.

ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతో మంది ఉదయం వేళ వచ్చే సూర్యకాంతిని పొందలేకపోతున్నారు. నైట్ ఫిష్ట్స్ లలో పనిచేయడం, లేక సూర్యుడు వచ్చే లోగానే పనిచేసే ఆఫీసులకు వెళ్లే వారికి డి విటమిన్ లోపం ఏర్పడుతుంది. డి విటమిన్ లోపం తలెత్తితే ఎముకలు, దంతాలకు సరిపడ కాల్షియం అందదు. తద్వారా మనం త్వరగా అలసిపోవడం, పనిలో చికాకు రావడం జరుగుతుంటుంది. అందుకే గుడ్డుపొట్టు పొడిని నీళ్లు, లేదా పాలలో కలుపుకుని తాగితే కాల్షియం సమస్య సులువుగా పరిష్కారమవుతుంది.

ఎక్కువగా నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలు!

గొంతునొప్పిని ఇట్టే త‌గ్గించే చిట్కాలు ఇవిగో !

నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే మీకు ఆ రోగాలున్న‌ట్టే?

జుట్టు రాలుతోందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -