Friday, April 19, 2024
- Advertisement -

మందుబాబుల్లో అది చూస్తే ఉందంటున్న యాంకర్ రవి!

- Advertisement -

ప్రముఖ టెలివిజన్ లో వచ్చిన ‘సమ్‌థింగ్‌ స్పెషల్, పటాస్ అనే ప్రోగ్రాంస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రవి బుల్లితెరపై స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. అలాగే వెండితెరపై యాంకర్ రవి ‘ఇది మా ప్రేమకథ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. తాజాగా రవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక చిన్న వీడియో షేర్ చేశారు.

యాంకర్ రవి హైదరాబాద్ కావూరి హిల్స్ ఏరియాలో కారులో వెళ్తుండగా అనుకోకుండా మందు బాబు ఒకరు రోడ్డు మీదకి ఎక్కి వాహనాలను అడ్డుకుంటూ కాసేపు రోడ్డుమీద హల్చల్ సృష్టించాడు. అలాగే యాంకర్ రవి కారుని కూడా ఆపడంతో చేసేదేమీ లేక ఆయన చేస్తున్న హంగామాని కొంతమేర ఫోన్ లో షూట్ చేశాడు. ఆ వీడియోకి సర్దార్ గబ్బర్ సింగ్ లోని “ఆడెవడన్న.. వీడెవడు అన్నా.. సర్దార్ అన్నకు అడ్డు ఎవడు అన్న.. అనే సాంగ్ తో రీమిక్స్ కొట్టి మరీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.

Also read:టాలీవుడ్ హీరోయిన్లను దూరం పెడుతున్న ప్రభాస్.. కారణం అదేనా?

అలాగే రవి ఆ వీడియో కి కామెంట్ రాస్తూ. ”మంచి చెడు చెబుదామంటే మొహానికి మాస్క్ లేదు, మైండ్ హాష్ లో లేదు కానీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఆయన ముఖం మీద చిరునవ్వు చూస్తే ఎక్కడో కాస్త అందంగా ఉంది. అవును నిజమే మన ఆనందాన్ని మనం మాత్రమే వెతుక్కోవాలి” అంటూ రవి కామెంట్ చేశాడు. అతన్ని దేవుడే జాగ్రత్తగా కాపాడాలని కూడా కామెంట్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:నాని రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -