Tuesday, May 14, 2024
- Advertisement -

బాహుబలి 2 ఫస్ట్ లుక్ ఒస్తోంది

- Advertisement -

రాజమౌళి కొత్త సినిమా బాహుబలి 2 కొసం దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ లో ఉన్న ఈ సినిమా యుద్ధ సన్నివేశాలు పూర్తి అవ్వగానే నేరుగా టాకీ పార్ట్ నీ పాటల నీ చిత్రీకరించే పనిలో కి వెళ్ళిపోతారు.

ఇప్పటి వరకూ భారత దేశ చరిత్ర లో కనీ వినీ ఎరుగని యుద్ధాలని తెరకి ఎక్కిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి . ప్రస్తుతం ఈ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ చివరి దశ కి చేరుకుంది. అలాగే మిగిలిన టాకీ పార్ట్, పాటల చిత్రీకరణ సెప్టెంబర్ నుండి నవంబర్ వరకూ జరుగుతుందని కూడా తెలుస్తోంది.

ఇకపోతే అన్నిటికన్నా ఆసకికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ ను హీరో, బాహుబలి పాత్రధారుడైన ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ పుట్టినరోజైన అక్టోబర్ 23న విడుదల చేస్తారని వినికిడి.

Related

  1. బాహుబలి లో ఎన్టీఆర్ పాట పాడనున్నాడా?
  2. బాహుబలి కంటే పెళ్లి చూపులు గొప్ప చిత్రం
  3. చైనాలో బాహుబలి సంచలనం!
  4. బాహుబలి రికార్డులను బ‌ద్ద‌లు కొట్టింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -