Tuesday, May 14, 2024
- Advertisement -

బాహుబలి కంటే పెళ్లి చూపులు గొప్ప చిత్రం

- Advertisement -

ఫామిలీ మొత్తం కలిసి చూడదగ్గ చిత్రం గా పెళ్లి చూపులు సినిమా మంచి మార్కులే కొట్టేసింది. ఎలాంటి హడావిడీ లేకుండా విడుదల అయిన ఈ సినిమా మౌత్ టాక్ తో నడుస్తోంది. స్టార్ కాస్ట్ లేదు, స్టార్ డైరెక్టర్ లేరు, ప్రొడ్యూసర్ కూడా కొత్తవారే కానీ సురేష్ బాబు ఈ సినిమాని కొనుక్కుని చక్కగా ప్రమోట్ చెయ్యడం మరొక పక్క మౌత్ టాక్ పాజిటివ్ గా వెళ్ళడం తో ఈ సినిమాకి అభిమానులు పెరిగిపోయారు.

ఈ సినిమా చూసిన ప్రముఖ సినిమా వారు అందరూ సినిమాని పొగిడేస్తూ ఉండడం చూస్తున్నాం. కోటి రూపాయల్లో బడ్జెట్టు రెజల్ట్ చూస్తే పది కోట్లు వారకూ వెళ్ళేలా ఉంది. రొటీన్ మసాలా ఫార్ములా ఏదీ లేకుండా ఈ సినిమా కి జనాలు బ్రహ్మరథం పడ్తూ ఉండడం విశేషం.

అయితే ఈ సినిమా గురించి స్పందిచిన దాసరి నారాయణరావు మధ్యలో అవసరం లేకపోయినా బాహుబలి చిత్రం గురించి లాక్కొచ్చారు. ‘బాహుబలి – పెళ్లి చూపులు ఈ రెండింటిలో మీ ఓటు దేని అని ఎవరైనా నన్ను అడిగితే నా ఓటు కచ్చితంగా పెళ్లి చూపులకే వస్తాను’ అని చెప్పారు దర్శకరత్న. ఆ చిత్రం రూపొందించిన బడ్జెట్ ఎంత..?  తెచ్చిపెడుతున్న లాభాల శాతం ఎంత…? ఇలాంటివి తన లెక్కలని దాసరి చెప్పారు.

Related

  1. పెళ్లి చూపులు మూవీ రివ్యూ!
  2. బాహుబలి రికార్డులను బ‌ద్ద‌లు కొట్టింది
  3. చైనాలో బాహుబలి సంచలనం!
  4. బాహుబలి-2 తర్వాత ఎలాంటి మూవీ చేయబోతున్నాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -