Friday, May 17, 2024
- Advertisement -

చిరు సినిమాలో హీరోయిన్ ఫిక్స్!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి అంటే ఇప్ప‌టికీ అభిమానుల్లో త‌ర‌గని ఉత్సాహం. కాస్త రాజ‌కీయాల్లోకి వెళ్లిన త‌రువాత ఇబ్బందులు ఎదుర్కున్న మాట వాస్త‌వ‌మే అయినా…న‌ట‌న ప‌రంగా ఆయ‌నపై అభిమానం నేటికీ చెక్కు చెద‌ర‌లేద‌నే చెప్పాలి. దాదాపు పదేళ్ళ తరువాత చిరంజీవి తన 150 వ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఇటివలే ఈ చిత్రం మొదలు అయ్యి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రం కు కత్తిలాంటోడు, నెపోలియాన్ అనే టైటిల్స్ పెట్టబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచరం ఎంటంటే.. ఈ సినిమాకి ఖైదీ నెం.150 అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది మాత్రం క్లారిటీ రాలేదు.

పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలోనే అందరూ డ్రాప్ అవుతున్నారు. చిరు 150వ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ హైప్ ఏర్పడింది. కలెక్షన్స్ కూడా దానికి తగినట్లుగానే ఉంటాయని హీరోయిన్స్ కూడా పారితోషికం విషయంలో అస్సలు తగ్గట్లేదు. లేటేస్ట్ న్యూస్ ప్రకారం చిరు సినిమాలో కాజల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాజల్ రామ్ చరణ్, బన్నీ, పవన్ తో జతకట్టిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు చిరు సరసన నటించడానికి రెడీ అవుతోంది.

Related

  1. చిరు సినిమా కు టైటిల్ ఫిక్స్‌!
  2. చిరు సినిమా షూటింగ్ ఆగిందా?
  3. చిరుతో మెగా హీరోస్ అదిరిపోయే డాన్స్!
  4. పూరిని మళ్లీ లైన్‍లో పెట్టిన చిరు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -