ఆగస్ట్ 22న తెలుగు రాష్ట్రాలలో మెగా పండగ కనబడింది. మెగా స్టార్ చిరంజీవి 61 వ పుట్టినరోజును ఊరు, వాడ గ్రాండ్ గా జరుపుకున్నారు. కానీ బర్త్ డే బాయ్ మాత్రం ఎక్కడ కనిపించక పోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. నైట్ జరిగిన ఈవెంట్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. కాగా నిన్నంతా చిరంజీవి ఎక్కడికి వెళ్ళాడు అని అందరూ మాట్లాడుకున్నారు.
ఫ్యామిలీ తో బర్త్ డే పార్టీ చేసుకున్నారు కావొచ్చు కొందరు అనుకున్నారు. కానీ చిరు ఏ పార్టీ చేసుకోలేదు.. చక్కగా చేపలను పట్టుకుంటూ కాలక్షేపం చేసాడు. ఏంటి నమ్మడం లేదా నిజమండి. హైదరాబాద్ సిటీకి చివర్లో ఉన్న తన ఫామ్ హౌస్ లో కాసేపు రెస్టు తీసుకొని ఆ తర్వాత ఫామ్ హౌస్ కు ఆనుకుని ఉన్న కొలనులో చేపలు పట్టారు.
సాయింత్రం వేళా మళ్లీ హైదరాబాద్ కు వచ్చి రాత్రి జరిగిన ఈవెంట్ లో పాల్గొని, ఈ ఉదయం ఫామ్ హౌస్ కు వెళ్లడం జరిగింది. మూడు నెలల చిరు తన 150వ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ సినిమా షూట్ లో పాల్గొనబోతున్నాడు.
Related
