Friday, May 3, 2024
- Advertisement -

చిరంజీవికి షాక్ ఇచ్చిన విజయశాంతి

- Advertisement -

ఇటివలే చిరు 150వ సినిమాలో విజయశాంతి ని ఓ రోల్ కోసం అడిగారు అని రూమర్ వస్తున్న విషయం తెలిసిందే. ఆమె కూడా ఒప్పుకుందనే వార్తలు వచ్చాయి. అయితే విజయశాంతి మాత్రం చిరంజీవి సినిమాలో నటించడం లేదట. ఈ సినిమా కోసం విజయశాంతి అప్రోచ్ కాలేదని యూనిట్ లోని కొంత మంది అంటున్నారు.

అసలు దర్శకుడు వినాయక్ విజయశాంతితో మాట్లాడలేదని అంటున్నారు. ఒక వేళ విజయశాంతిని అడిగినా ఆమెకు నటించే ఉద్దేశం లేదని చెప్పాలనుకుంటందట. ఇప్పుడు తనకు సినిమాలో నటించాలి అని లేదని తన సన్నిహితులతో చెబుతోందట. అయితే చిరు చిత్రంలో ఓ లేడి కేరక్టర్ ఉందట ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట.

కానీ మంచి నటి దొరకకపోతే ఆ స్థానంలో మగ కేరక్టర్ ని పెట్టాలనుకుంటున్నారట డైరెక్టర్. అయితే ఆ పాత్రకి విజయశాంతి అయితే బాగుంటుందని చిరంజీవి కూడా అన్నారట. కాకపోతే ఆమెను ఇంక అప్రోచ్ కాలేదని అంటున్నారు. ఆల్రెడీ అడిగారని… ఆమె ఇంతకు ముందే రిజెక్ట్ చేసిందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి రూమర్స్ వస్తున్న యూనిట్ మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మరి ఆ లేడి కేరక్టర్ ఎవరు చేస్తారు అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

Related

  1. పూరిని మళ్లీ లైన్‍లో పెట్టిన చిరు!
  2. చిరు మొదలు పెట్టేసాడు!
  3. చిరు పై బాహుబలి భారం
  4. చిరు సందీప్ ని ఎందుకు తిట్టాడు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -