Wednesday, May 15, 2024
- Advertisement -

చిరు కోటి రూపాయలు ఇస్తాడు మనందరికీ

- Advertisement -

చిరంజీవిని 150 సినిమాకి ముందు మరోసారి చూడాలని భావిస్తున్నారా? ఆడియో ఫంక్షన్స్ లో అతిధిగానో – అవార్డు ఫంక్షన్ లో మాట్లాడేటప్పుడో కాదు బుల్లితెరపై చూడాలని ఉందా? ఆ కోరిక తీరబోతుందని ఇప్పటికే చాలా మందికి తెలుసు. ఈ సమయంలో మెగాస్టార్ చేపట్టబోయే “మీలో ఎవరు కోటీశ్వరుడు” నాలుగో సీజన్ కు చిరు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.

ఇది కూడా తెలిసిన విషయమే కదా అంటారా? అయితే ఇప్పుడు చెప్పబోయేది మాత్రం కొత్త విషయమే! అవును… మీలో ఎవరు కోటీశ్వరుడికి సంబందించిన మెగా సర్ ప్రైజ్.. ఈ షో కి సంబందించిన ప్రోమో విడుదలయ్యింది. కోట్ల హృదయాల్ని కొల్లగొట్టినవాడు.. మీతో కోటి గెలిపించడానికొస్తున్నాడు..

మెగా సెలబ్రేషన్ బిగిన్స్… సూన్ ఆన్ “మా”!

అంటూ చిరు న్యూలుక్ – సూట్ లో సూపర్ గా కనిపిస్తున్న చిరు ఈ ప్రోమోలో పూర్తిగా కనిపించకపోయినా ఆ మెగా వైబ్రేషన్స్ మాత్రం ఈ ప్రోమోలో పుష్కలంగా కనిపించాయి. ప్రస్తుతం ఈ ప్రోమోతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. ఈ షో డిసెంబర్ 12 నుండి మాటీవీలో ప్రసారం కానుంది. సక్సెస్ ఫుల్ షోగా పేరుపొందిన ఈ మీలో ఎవరు కోటీశ్వరుడుకి సంబందించి ఇప్పటి దాకా నాగార్జున మూడు సీజన్లు చేశారు. ఇప్పుడు నాలుగో సీజన్ చిరుతో మొదలుకాబోతోంది. ఈ కార్యక్రమం సోమవారం నుంచి గురువారం దాకా ప్రతీరోజూ రాత్రి 8-30 గంటలకు ప్రసారమవుతుంది. చిరంజీవి 150 షూటింగ్ కు ఇబ్బందికలగకుండా దీని షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే.. ఈ షోలో ఒక ఎపిసోడ్ లో చిరంజీవితో కలిసి హాట్ సీట్ లో అతిథిగా నాగార్జున కనిపించనున్నారు!

{youtube}v=pTaWy1ME840{/youtube}

Related

  1. చిరంజీవి మీద దాడి చేయించింది ఎవరు ?
  2. పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం ఆసక్తిగా చూసిన చిరంజీవి
  3. చిరంజీవి కోసం సాయి ధరం తేజ త్యాగం
  4. తరుణ్ అరోరాతో చిరంజీవి ఫైటింగ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -