Sunday, May 19, 2024
- Advertisement -

వెలగపూడి నుంచే మొత్తం నడుస్తోంది

- Advertisement -

అక్టోబర్ 3 నుంచి వెలగపూడి లోని సచివాలయం ఉద్యోగులతో కళకళలాడనుంది. ఇప్ప టికే ఉద్యోగులు ఆంధ్ర ప్రదేశ్‌కు మకాం మార్చేం దుకు ఏర్పాట్లు చేసుకు నేందుకు ఇక్కడకు వచ్చేశారు. అన్ని శాఖలు సచి వాలయం నుంచే విధులు నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదిలి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చేరుకుంటున్నారు.

ఇప్పటికే పలు శాఖల ఉద్యోగులు నవ్యాంధ్రకు చేరుకుని నివాసం ఉండేందుకు అనువైన ఇళ్లు వెతుక్కునే పనిలో నిమగ్నమయ్యారు. సచివాలయానికి, పిల్లల స్కూళ్లు, కాలేజీలు తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుంటూ గృహాలు వెతుక్కుంటున్నారు. ఎక్కువగా విజయవాడ, తాడేపల్లి, మంగళగిరిలో ఉండేందుకు ఉద్యోగులు ఆసక్తి కనబరుస్తున్నారు.

డిపార్ట్ మెంట్‌కు ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మిగిలిన ఉద్యోగులందరూ రాజధానికి వచ్చేస్తున్నారు. పలు లావాదేవీలు, కేసులు తదితర అంశాలకు సంబంధించిన పనులు నిమిత్తం ఆ ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు ఉమ్మడి రాజధానిలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 3 నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వెలగపూడిలో మొదటిగా ఆర్థికశాఖ కార్యాలయం ప్రారంభమ యింది. 3 నుంచి అన్ని శాఖల కార్యాలయాలు వెలగపూడిలోనే కార్యకలా పాలు కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -