Saturday, May 11, 2024
- Advertisement -

ధోనీ కి రామ్ చరణ్ కి సంబంధం ఏంటి?

- Advertisement -

ఎం.ఎస్. ధోనీ ఇతని గురించి పరిచయం అవసరం లేదు. క్రికెట్లో భారత్ కు రెండోసారి వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన గ్రేట్ కెప్టెన్. ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మిస్టర్ కూల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎం.ఎస్ ధోనీ – ది అన్‌టోల్డ్ స్టోరీ’. ఈ సినిమా నెల 30 ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిధ్ధం అయ్యింది.

ఇటీవలే సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ పొందింది. 3 గంటల 10 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 60 దేశాలలో 4,500 స్క్రీన్లలో విడుదలవుతోంది. ఇక బాలీవుడు సినిమా ఇన్ని సెంటర్లలో విడుదల అవ్వడం ఇదే మొదటిసారి. భారత్ లో కూడా ఎక్కువ సెంటర్లలో విడుదల అవుతోంది.

ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుశాంత్ సింగ్ ధోనీగా అలరించనున్నాడు. ధోని భార్య సాక్షి పాత్రలో కైరా అద్వాణీ నటిస్తోంది. లవర్ గా దిశా పటాని కనిపించనుంది. అయితే ఇందులో క్రికెటర్లగా కొంతమంది నటులు గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నారు. వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఉన్నాడు. రామ్ చరణ్ పోషించే పాత్ర పేరు బయటికి వచ్చింది. సురేష్ రైనా పాత్రలో చరణ్ మెరవనున్నట్లు తెలుస్తోంది. రైనాగా రామ్ చరణ్ ఎలా ఆడాడో తెలియాలి అంటే ఈ నెల 30 వరకు ఆగాల్సిందే.

Related

  1. సుమ – ధోనీ సంభాషణ అదరహో
  2. షాకింగ్ : ఒక అమ్మాయి కోసం దేవదాసు అయిపోయిన ధోనీ
  3. రామ్ చరణ్ తో ప్రభాస్!
  4. చరణ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -