Tuesday, April 30, 2024
- Advertisement -

ప్రధాని రాజీనామా.. పదవి చేపట్టిన 45 రోజుల్లోనే షాక్ !

- Advertisement -

ఆ మద్య జరిగిన బ్రిటన్ ప్రధాని ఎన్నికలు ప్రపంచ దేశాలను ఆకర్షించాయి. ఎందుకంటే ప్రధానిగా కొనసాగుతున్న బోరిస్ జాన్సన్ పై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఏర్పడడం.. ఆ తరువాత ప్రధాని పోటీలో భారత సంతతికి చెందిన రిషి సునాక్ నిలవడం.. తీరా ఎన్నికల ఫలితాల్లో ఎవరు ఊహించని విధంగా లీజ్ ట్రస్ గెలుపొంది.. రిషి సునాక్ కు షాక్ ఇవ్వడం.. ఇవన్నీ అంశాలు ప్రపంచ దేశాలను బ్రిటన్ వైపు చూసేలా చేశాయి. అయితే తాజాగా ప్రధాని పదవి చేపట్టిన 45 రోజులకే లీజ్ ట్రస్ ఆ పదవికి రాజీనామా చేయడంతో మరోసారి బ్రిటన్ రాజకీయ వ్యవహారం వరల్డ్ మీడియాలో హాట్ టాపిక్ అయింది..

లీజ్ ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మునుపే అనేక సవాళ్ళు, రాజకీయ సంక్షోభంతో బ్రిటన్ కొట్టుమిట్టాడుతుండగా క్లిష్ట పరిస్థితుల్లో లీజ్ ప్రధాని ఎన్నికల్లో గెలుపొందారు. ఇక ట్రస్ బాద్యతలు చేపట్టిన తరువాత పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని భావించరంతా. అయితే లీజ్ ట్రస్ అధికారం చేపట్టిన తరువాత ఆమె తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యంగా ఆమె ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అర్హ్తిక బడ్జెట్ పై తీవ్రమైన విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆదాయపు పన్ను రాయితీ ఇవ్వడంలో లీజ్ మాట తప్పారని, ప్రధాని పదవికి రాజీనామా చేయాలని సొంత పార్టీ నేతల నుంచే ఆమెపై వ్యతిరేకత ఏర్పడడంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేనందుకు రాజీనామా చేస్తున్నట్లు లీజ్ పేర్కొన్నారు. ఇక లీజ్ ట్రస్ రాజీనామాతో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధానిగా భాద్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -