Tuesday, April 16, 2024
- Advertisement -

సాధారణ స్థితికి రావడానికి రెండు నెలల సమయం పట్టింది: తమన్నా

- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా నటించిన వెబ్ సిరీస్ “నవంబరు స్టోరీస్‌” . తమన్నా ఈ వెబ్‌ సిరీలో అనురాధా గణేశన్‌ పాత్రలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ వెబ్ సిరీస్ కు ఇంద్రా సుబ్రమణియన్‌ దర్శకత్వం వహించింది. ఈ సిరీస్ మానవీయ కోణంలో మనసుల భావోద్వేగాలు సింపుల్‌గా, సహజంగా చిత్రీకరించడం తో ఈ సిరీస్ కు మంచి స్పందన లభించింది.

హీరోయిన్ తమన్నా ఇటీవల కాలంలో కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను అభిమానులతో పంచుకుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తిరిగి నార్మల్‌ కావడానికి నాకు రెండు నెలలు సమయం పట్టింది. ఆ సమయంలో నేను మానసికంగా, శారీరకంగా దూరంగా ఉండడానికి వ్యాయామాలు వంటివి చేశాను.ఆ సమయంలో వ్యాయామాలు చేయడం చాలా కష్టంగా అనిపించి నీరసంగా ఉండేది. కరోనా బారినపడి ఇబ్బంది పడే దానికంటే ముందు జాగ్రత్త చర్యగా మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి కరోనా నియమాలు పాటించడం మంచిది. అని సూచించింది.

Also read:థ్రిల్లింగ్‌ కథతో చేయడానికి సిద్ధమైన చందమామ!

మిల్కీ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో సంపత్‌ నంది దర్శకత్వంలో “సీటీమార్‌”అనే సినిమాలో తెలంగాణ కబడ్డీ కోచ్‌ జ్వాల రెడ్డి పాత్రలో నటిస్తోంది. తమన్నా ఈ మూవీలో తెలంగాణ యాసతో డబ్బింగ్‌ చెప్పడం విశేషం. తర్వాత సూపర్ హిట్ హిందీ చిత్రం “అంధాధున్‌” తెలుగు రీమేక్‌ “మాస్ట్రో”లో , అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న “ఎఫ్‌ 3″మూవీలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

Also read:లక్కీ ఛాన్స్ కొట్టేసిన..ఫరియా అబ్దుల్లా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -