Tuesday, April 23, 2024
- Advertisement -

అదిరిపోయే శుభాకాంక్షలు చెప్పిన చిరు.. కొరటాలకు మరుపురాని కానుక!

- Advertisement -

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెలుగు ఇండస్ట్రీకి మాటల రచయితగా పరిచయమై తన అద్భుతమైన ప్రతిభతో 2013లోప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. తర్వాత వచ్చిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మించి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కొరటాల శివ ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య వంటి భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో కీలక పాత్రలు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కనిపించనున్నారు. ఇందులో దేవాదాయ శాఖ ఉద్యోగిగా చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.ఆచార్య తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎన్టీఆర్‌ 30వ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్ర యూనిట్.

Also read:గతంలోకి వెళ్లిన రవితేజ.. క్రేజి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు?

కొరటాల శివ జన్మదినం సందర్భంగా జూన్‌15న నేడు ఆయనకు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ కలానికి, సమాజంలో మార్పు తేవాలనే తపన ఉంది. ఆ దర్శకుడికి, ఆశయాన్ని దృశ్యంగా మలిచే దార్శనికత ఉంది. ఆచార్య సృష్టికర్త కొరటాల శివకి జన్మదిన శుభాకాంక్షలు అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:రకుల్ ప్రీత్ వంట.. వీడియో తీసి మరి పరువు తీసిన తమ్ముడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -