Thursday, March 28, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ని ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. కొరటాల ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ తన 31వ సినిమాను కేజిఎఫ్ ప్రేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

వివరాల్లోకెళ్తే ..ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీలో ఎన్టీఆర్ అండర్ వరల్డ్ డాన్ గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడట.ఇక ఈమూవీ కథ విషయానికొస్తే బయోవార్ నేపథ్యంలో సాగే అద్భుతమైన కథ అని తెలుస్తోంది.ఇక తాజాగా ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు.

Also read:ప్రియదర్శి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ లో గిరిజన వీరుడు కొమురం భీమ్‌ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే మూవీపై తెలుగు ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని చెప్పాలి. మిగిలిన షూటింగ్ ని కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని రాజమౌళి ఆలోచనలో ఉన్నాడట.

Also read:ఈ నటుడి కథను సినిమా తీస్తే.. పక్క సూపర్ హిట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -