Tuesday, April 16, 2024
- Advertisement -

ఇండోనేషియాలో వదర బీభత్సం.. 75 మంది మృతి

- Advertisement -

ఇండోనేషియాను భారీ వరదలు ముంచెత్తాయి. తూర్పు తైమూర్ లో ఆకస్మికంగంగా సంభవించిన వరదలతో కొండ చరియలు విరిగిపడటంతో 75 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. డజన్ల కొద్దీ మంది వరదల కారణంగా గల్లంతయ్యారు. కుండపోతవర్షం, వరదల కారణంగా ఇండోనేషియాలోని ఫ్లోరెస్ నుండి తూర్పు తైమూర్ వరకు విస్తరించిన ద్వీపాలలో ప్రకృతి విధ్వంసం సృష్టించింది.

జ‌ల ప్ర‌ళ‌యం కార‌ణంగా వేలాది మంది ప్ర‌జ‌లను ప్ర‌భుత్వం సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించింది. వ‌ర‌ద‌ల కార‌ణంగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టం, అన‌క‌ట్ట‌లు పొంగిపొర్ల‌డంతో వేలాది ఇండ్లు నీట మునిగాయి. వ‌ర‌ద‌ల కార‌ణంగా ఒక్క తూర్పు తైమూర్‌లోనే 21 మంది మ‌ర‌ణించార‌నీ, ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు గ‌ల్లంత‌య్యార‌ని స‌మాచారం.

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇండోనేషియాలోని తూర్పు ఫ్లోరెస్ మున్సిపాలిటీలో ఇళ్లు, వంతెనలు, రహదారులు బురదమ‌యంగా మారాయి. వ‌ర‌ద కార‌ణంగా ఏర్ప‌డిన ప‌రిస్థితులు స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లిగిస్తున్నాయ‌ని అధికారులు తెలిపారు.

ప్ర‌స్తుతం వేలాది మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డంతో పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉంచామని తెలిపారు. కాగా, ఆ దేశ విపత్తు ఏజెన్సీ అంచనా ప్రకారం 125 మిలియన్ల ఇండోనేషియన్లు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

కరోనా టెర్రర్.. ఒకే రోజు లక్ష మందికి పాజిటివ్

క్రికె‌ట్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. షెడ్యూల్ ‌ ప్రకారమే ఐపీఎల్ !

‘మాస్ట‌ర్’‌ డైరెక్టర్‌తో ప్రభాస్‌ సినిమా !

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ అందుకు ఒప్పుకునేనా ?

ఒకే రోజు 93 వేల కేసులు.. 500కు పైగా మ‌ర‌ణాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -