Tuesday, April 23, 2024
- Advertisement -

కొండెక్కిన కోడి.. క‌రోనానే కార‌ణ‌మా?

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కోడి కొండెక్కింది. సామాన్యుల‌కు ఏమాత్రం అంద‌నంటోంది. దీనికి వేస‌వితో పాటు క‌రోనా మ‌హ‌మ్మారే కార‌ణ‌మ‌ని చెబుతోంది. అదేంటబ్బా అనుకుంటున్నారా? అయితే.. అస‌లు విష‌యం ఇప్పుడు తెలుసుకుందాం.. గ‌త కొంత కాలంగా మాంస ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా చికెన్ ధ‌ర‌లు ఇప్పిటికే రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

అంత‌టితో అగ‌కుండా ఇంకా పైపైకి సాగుతున్నాయి. గ‌త వారం కిలో చికెన్ ధ‌ర రూ.210 ఉండ‌గా.. ప్ర‌స్తుతం రూ.260 పైగా ధ‌ర ప‌లుకుతోంది. మ‌రికొన్ని చోట్ల స్కిన్ లెస్ చికెన్ ధ‌ర కిలోకు రూ.270 నుంచి మూడు వంద‌ల వ‌ర‌కు ఉంటోంది. లైవ్ సైతం గ‌త వారం ధ‌ర రూ. 125 ఉండ‌గా.. ప్ర‌స్తుతం 160 రూపాయ‌ల‌కు పైగా ధ‌ర ప‌లుకుతోంది.

ఇలా చికెన్ ధ‌ర‌లు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఎండ‌కాలమేన‌నీ, డిమాండ్ కు త‌గిన‌ట్టుగా స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌డం, ర‌వాణా ఛార్జీలు పెర‌గడం, కోళ్ల దాణ ధ‌ర‌లు సైతం అధికం కావ‌డ‌మేని దుకాణ‌దారులు పేర్కొంటున్నారు. మ‌రీ ముఖ్యంగా క‌రోనా నేప‌థ్యంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాల‌నీ, చికెన్, గుడ్లు అధికంగా తినాల‌ని వైద్యులు, అధికారులు పేర్కొన‌డం వ‌ల్ల కూడా స‌మ్మ‌ర్ తో పని లేకుండా చికెన్ కు డిమాండ్ పెరిగింద‌ని చెబుతున్నారు.

కాగా, గుడ్ల ధ‌ర‌లు మాత్రం స్థిరంగా కొన‌సాగుతున్నాయి. గ‌త వారం డ‌జ‌ను గుడ్ల ధ‌ర 60 రూపాయ‌లు ఉండ‌గా.. ప్ర‌స్తుతం అదే ధ‌ర కొన‌సాగుతోంది. అయితే, రానున్న రోజుల్లో కోడి మాంసంతో పాటు, చికెన్ ధ‌ర‌లు సైతం భారీగా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని దుకాణ‌దారులు పేర్కొంటున్నారు. దీనికి డిమాండ్ త‌గిన‌ట్టుగా స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌డం కూడా ఓ కార‌ణ‌మ‌ని పేర్కొంటున్నారు.

ఇండోనేషియాలో వదర బీభత్సం.. 75 మంది మృతి

కరోనా టెర్రర్.. ఒకే రోజు లక్ష మందికి పాజిటివ్

క్రికె‌ట్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. షెడ్యూల్ ‌ ప్రకారమే ఐపీఎల్ !

‘మాస్ట‌ర్’‌ డైరెక్టర్‌తో ప్రభాస్‌ సినిమా !

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ అందుకు ఒప్పుకునేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -