Saturday, April 27, 2024
- Advertisement -

50 లక్షల వ్యూస్​ కొల్లగొట్టిన లాహేలాహే..!

- Advertisement -

ఓ పాట హిట్​ అయ్యిందా? ఫట్​ అయ్యిందా? అని తెలుసుకొనేందుకు వేరే ప్రమాణాలు ఏమీ అక్కర్లేదు. యూట్యూబ్​లో విడుదలైన పాటకు ఎన్ని వ్యూస్​ వచ్చాయో లెక్కలు తీస్తే సరిపోతుంది. అది ప్రస్తుత ట్రెండ్​. ఇప్పటికే తెలుగులో అనేక పాటలు యూట్యూబ్​లో రికార్డు స్థాయిలో వ్యూస్​ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది అల్లు అర్జున్​ నటించిన అలవైకుంఠపురములో చిత్రంలోని సామజవరగమనా, రాములో రాములా, బుట్టబొమ్మ వంటి పాటలు కోట్లలో వ్యూస్​ సాధించాయి.

ఇక యాంకర్​ ప్రదీప్​ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలోని నీలి నీలి ఆకాశం కూడా రికార్డు స్థాయిలో వ్యూస్​ సాధించింది. ఇటీవల విడుదలైన లవ్​స్టోరీలోని సారంగధరియా పాట కూడా యూట్యూబ్ లో దూసుకుపోతోంది. తాజాగా మెగాస్టార్​ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలోని ‘లాహేలాహే’ అనే ఓ పాట యూట్యూబ్​లో సంచలనాలు నమోదు చేస్తున్నది. ఇప్పటికే ఈ పాట 50 లక్షల వ్యూస్​ సాధించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఇవాళ ఓ అధికారికి ప్రకటన విడుదల చేసింది.

Also Read: నువ్వు బయట ఎంత తోపు అయినా కావచ్చు.. చిరుతను క్షణాల్లో ఈడ్చుకెళ్లిన మొసలి..!

ఆచార్య చిత్రంలో మెగాస్టార్​ టైటిల్​ రోల్​ చేస్తుండగా.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కొర‌టాల శివ ఈసినిమానుతెరకెక్కిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా మెజార్టీ భాగం షూటింగ్ పూర్తయ్యింది కానీ లాక్​డౌన్​తో ఇంకా ఈ మూవీ రిలీజ్​ కాలేదు.

అయితే హైదరాబాద్​ శివారు ప్రాంతం కోకాపేట‌లో వేసిన టెంపుల్ సెట్‌లో ఈ ‘లాహే లాహే..’ సాంగ్‌ను చిత్రీక‌రించారు. ఈ లిరికల్ సాంగ్ ని యూట్యూబ్​లో విడుదల చేయగా రికార్డు వ్యూస్​తో దూసుకుపోతున్నది. ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్​ అందించగా .. మణిశర్మ మ్యూజిక్​ కంపోజ్​ చేశారు. ఇక చిరంజీవి వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్​ ఫిదా అయిపోతున్నారు. హారిక నారాయ‌ణ్‌, సాహితీ ఆలపించిన ఆ పాట.. కాస్త ఫోక్​ స్టయిల్లో ఉంటుంది.

Also Read: తొలకరి కురిస్తే అక్కడ వజ్రాల పంట.. ఇప్పుడక్కడ బంగారు గనుల తవ్వకానికి అనుమతి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -