Saturday, May 18, 2024
- Advertisement -

పాపం ఆ నటి.. ఒక్క సిన్ కోసం రెండు రోజులు స్నానం చెయ్యకుండా?

- Advertisement -

సాధారణంగా ఒక సినిమా చిత్రీకరించాలి అంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఆ పాత్రలో నటించడం కోసం నటీనటులు ఎంతో శ్రమ పడుతుంటారు. పాత్రకు అనుగుణంగా వారి శరీర బరువును పెంచుకోవాలన్న, లేదా తగ్గించుకోవాలి అన్న అందుకు అనుగుణంగా వారి శరీరాకృతిని మార్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సినిమాలో నటించడం కోసం వారికి తెలియని ఎన్నో విద్యలు విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి పరిణితి చోప్రా కూడా తన తాజా చిత్రం కోసం ఏకంగా రెండు రోజులు స్నానం చేయలేదు అనే విషయాన్ని తాజాగా తెలియజేశారు.

పరిణితి చోప్రా తాజాగా నటిస్తున్న మూవీ సందీప్ ఔర్ పింకీ పరార్.ఈ సినిమా షూటింగ్ లో భాగంగా కొండల ప్రాంతంలో మురికిగా ఉన్న ప్రదేశంలో పడుకుని మరుసటి రోజు స్నానం చేయకుండా షూటింగ్ కి వెళ్లానని తెలిపారు. ఈ సినిమాలో భాగంగా ఓ సంఘటనలో గర్భవిచ్ఛిత్తి జరగడం వల్ల ఆమె అదే షాక్ లో ఉండే సీన్లను సహజంగా నటించాలని భావించడంతో పరిణితీ ఈ విధంగా రెండు రోజులు స్నానం చేయలేదని తెలిపారు.

Also read:కేజిఎఫ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. అసలు నిజం?

చిత్రంలోని ఈ సన్నివేశం కొండ ప్రాంతాలలో రెండు మూడు రోజులపాటు ఓ గుడిసెలో ఈ చిత్రీకరణ జరిగింది. ఆ ప్రాంతంలో పడుకుని అలాగే ఇంటికి వెళ్లి మరుసటి రోజు స్నానం చేయకుండా షూటింగ్ కు వచ్చే దానినని ఈ సన్నివేశాలు ఎంతో సహజంగా రావడం కోసమే తను స్నానం చేయకుండా మేకప్ లేకుండా అత్యంత సహజంగా ఉండడం కోసమే ఈ విధంగా చేశానని తాజాగా నటి తెలిపారు.

Also read:అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ హీరో.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -