Monday, May 20, 2024
- Advertisement -

జ‌న‌సేన స‌ర్వే తో.. జగన్ కు పెద్ద తలనొప్పి..

- Advertisement -
Janasena Survey Jagan In Tension

ఏపీలో వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. చంద్ర‌బాబుకు ఓట‌మి ఖాయం అంటూ భారీ ఎత్తున ప్ర‌చారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయ్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ కూడా పెద్ద స‌ర్వే ఒకటి నిర్వ‌హించింది. ఈ సర్వేలో వ‌చ్చిన రిజ‌ల్ట్స్ చూశాక జ‌గ‌న్ నోట మాట రాలేదట. 2019 ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ గా ఉన్న జనసేన ఇటీవల ఓ సర్వే నిర్వహించిందట. ఆ సర్వే ఫలితాలు జనసేనతో పాటు జగన్ ని కూడా షాక్ ఇచ్చాయట.

ఆ సర్వే ముఖ్య ఉద్దేశం.. ఇప్పటికిప్పుడు ఎన్నికల్లు వస్తే.. ఎవరికెన్ని సీట్లు వస్తాయి అన్నది తెలుసుకోవడమే. జనసేన నిర్వహించిన సర్వే లో ఇప్పుడు ఎన్నికలు వస్తే.. టీడీపీ కి 71 ,జనసేనకు 65 ,వైసీపీ కి 39 స్థానాలు వస్తాయని తెలిసిందట. అంతటి సానుకూల ఫలితాలు ఊహించని జనసేన కూడా సర్వే రిజల్ట్ తో షాక్ అయ్యిందట. పార్టీ నిర్మాణం,అభ్యర్థుల ఎంపిక బాగా ఉంటే ఇంకొన్ని స్థానాలు సాధించగలమని జనసేన అంచనా వేస్తోందట.

అయితే జగన్ మాత్రం ఈ సర్వే ఫలితాల గురించి తెలుసుకుని కాసేపు బెంబేలెత్తి ఆపై ఈ సర్వే జరిగింది నిజమేనా అని డౌట్ వ్యక్తపరిచారంట. లేని సర్వేలను తీసుకొచ్చి కంగారుపెట్టొద్దని సన్నిహితులతో అన్నారట. పైగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని డంకా భజాయించి చెప్పారట. ఆ ఎపిసోడ్ అయిపోయాక ఇంకో నేతని పిలిచి ఆ జనసేన సర్వే వివరాలు కరెక్ట్ గా కనుక్కోమని ఆదేశించారట. మ‌రి ఆయ‌న ఎలాంటి క‌బురు జ‌గ‌న్‌కి అందిస్తాడో చూడాలి. సో మొత్తానికి ప‌వ‌న్ స‌ర్వేతో జగన్ కి షాక్ తగిలింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -